KhammamPoliticalTelangana

భూ కబ్జా అక్రమ నిర్మాణం పై బాధితుల ఆక్రందన

భూ కబ్జా అక్రమ నిర్మాణం పై బాధితుల ఆక్రందన

భూ కబ్జా అక్రమ నిర్మాణం పై బాధితుల ఆక్రందన

  • సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్
  • నిలుపుదలపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు సూచన
  • సిపి కు సమాచారం పై హామీ

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం : తమభూమిని బలవంతంగా కబ్జా చేయడమే కాకుండా వాసిరెడ్డి శ్రీనివాసరావు, కోన గోవిందరావు , తమ్మారపు లక్ష్మణ్ అనే వ్యక్తులు అక్రమ నిర్మాణాలు మొదలుపెట్టారని బాధితులు చేపూరి పద్మ శ్రావణి , నైనిషా, నవ జ్యో త్ సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎదుట తమ ఆక్రందన వినిపించగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు వివిధ సంఘాల నాయకులు , బాధితులు తెలిపారు.

అంతేకాకుండా ఈ విషయంపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు నిలుపుదల చేయాలని సూచిస్తానని పేర్కొన్నట్లు వివరించారు. అదేవిధంగా ఈ అంశంపై సి పి కు సైతం తగిన సమాచారం పంపుతాను అన్నారు.

వివిధ సంఘాల నాయకులు , బాధితుల కథనం మేరకు వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 494 లో వచ్చే రోటరీ నగర్ అంతర్భాగ శ్రీ నగర్ రోడ్డు నెంబర్ 15 , సందులో 15 / 02 / 13 లో బాధితులు నివసిస్తున్నారు. ఈ సర్వే నెంబరు పరిధిలో 13 సంవత్సరాల క్రితం మూడు ఎకరాల 1. 33 కుంటల స్థలాన్ని చేపురి పద్మ , చేపురి సంధ్యారాణిలు కొనుగోలు చేశారు.

కాగా ఈ భూమి తమదని గత కొంతకాలంగా తమకు అన్ని విధాలుగా వేధిస్తున్న వాసిరెడ్డి శ్రీనివాసరావు , కోన గోవిందరావు ,తమ్మరపు లక్ష్మణ్ లు ఇటీవల తమ భూమిని బలవంతంగా ఆక్రమించుకొని , ఆ భూమిలో అక్రమ నిర్మాణం మొదలు పెట్టారని అవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా , హైకోర్టు లలో కేసు నడుస్తూ , తుది తీర్పు పెండింగ్ లో ఉండగా ఇరుపక్షాలు ఆ స్థలంలో వెళ్లకూడదనే నియమ నిబంధన ఉన్నప్పటికీ సదరు నిందితులు వీటిని అతిక్రమించి, స్థలం కబ్జా చేయడంతో పాటు అక్రమ నిర్మాణాలను మొదలుపెట్టారని తెలిపారు.

ప్రశాంతమైన ఖమ్మం నగరంలో ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు , ఉన్నత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించి, తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన బృందంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి. కృష్ణారావు , సీనియర్ ఉద్యమకారులు పగడాల నరేందర్ , మందడపు శంకర్రావు , రాచమల్ల ఉమా యాదవ్ , మహాత్మా జ్యోతిబా పూలే సొసైటీ అధ్యక్షులు పెల్లూరి విజయకుమార్ , లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోతు బద్రు నాయక్ , ఎంబీసీ చైర్మన్ బాసాటి హనుమంతరావు , ఉద్యమకారులు రెడ్డి బోయిన వరలక్ష్మి , బా లిన భాస్కర్ రెడ్డి , బుఖ్య శ్రీనివాస్ నాయక్ , దేవల్ల నాగేశ్వరావు , జల్లిపల్లి సైదులు , తాడొజు వెంకట చారి , శ్రీనివాస్ , నాగేశ్వరరావు , అనంతలక్ష్మి ,స్వరూప , ధనలక్ష్మి ,ఆకారపు కృష్ణవేణి ,దొడ్డ శ్రీనివాస్ రెడ్డి , పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!