అంగన్ వాడీలో అవకతవకలు
కోడిగుడ్ల పంపిణీలో గోల్ మాల్
అంగన్ వాడి సెంటర్ కు 4 దఫాలుగా కోడిగుడ్లు రావాల్సి ఉండగా మూడో విడతకే మొత్తం తీసుకుని వాటిని రికార్డు లలో రాయకుండా, పంపిణీ చేయకుండా మాయం చేసినట్లు గుర్తించారు.
కేంద్రం పరిధిలో 37 మంది విద్యార్థులు, 19 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నట్లుగా చూపారని, క్షేత్రస్థా యిలో అంత మొత్తంలో లబ్దిదారులు లేరని సూపర్వైజర్ ఉమాదేవి తెలిపారు.
సమగ్ర విచారణ నిమిత్తం మంగళవారం మాచర్లలోని సీడీపీవో వద్ద విచారణ చేయటం జరుగుతుందన్నారు కేంద్రానికి వచ్చిన గుడ్ల పంపిణీలో కార్యకర్త గోల్మాల్ చేసినట్లు సూపర్వైజర్ ఉమాదేవి పేర్కొన్నారు.
మండలంలోని పేటసన్నెగండ్ల శివారు ల్లోని పోతురాజుగుట్టలో 151వ కేంద్రంలో సోమవారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించి దస్త్రాలను పరిశీలించారు. అంగన్వాడి సెంటర్ పరిధిలోని లబ్ధిదారులకు సరిగా పంపిణీ చేయటం లేదని ఆ ప్రాంత ప్రజలు తెలుపుతున్నారు.
గతంలో ఈ అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు అరకొరగా సరుకులు పంపిణీ చేసి మిగతా వాటిని బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని పోతురాజు గుట్ట ప్రాంత వాసులు కోరుతున్నారు.