రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ చేయుటం జరిగిందని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ తెలిపారు మంగళవారం ఆడియో కార్యాలయంలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బిచ్కుంద, బిర్కూర్, నసురుల్లాబాద్, మద్నూర్, మహమ్మద్ నగర్, పెద్ద కొడఫల్, జుక్కల్, నిజాంసాగర్, డోంగ్లి …

రేషన్ డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
బాన్సువాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని చౌకధరల దుకాణం డీలర్ల ఖాళీల భర్తీకి సంబంధించిన ప్రకటన జారీ చేయుటం జరిగిందని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ తెలిపారు మంగళవారం ఆడియో కార్యాలయంలో ప్రెస్ నోట్ విడుదల చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవిన్యూ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బిచ్కుంద, బిర్కూర్, నసురుల్లాబాద్, మద్నూర్, మహమ్మద్ నగర్, పెద్ద కొడఫల్, జుక్కల్, నిజాంసాగర్, డోంగ్లి మండలాల్లో ఉన్న రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో (28)ఖాళీగా ఉన్న చౌకదారు దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇందులో
మండలాల వారీగా ..
బాన్సువాడ, తడ్కోల్ గ్రామం ఒసి జనరల్ బిచ్కుంద మండలంలోని గుండె నెమలి, గ్రామంలో బీసీ జనరల్, పెద్ద ధడ్డి గ్రామం ఎస్సి జనరల్ బిచ్కుంద 3 బీసీ మహిళా, గుండెకల్లూర్ కు ఎస్సి జనరల్, బిచ్కుంద 5 ఎస్టి మహిళా, బీర్కూర్ మండల కేంద్రంలో ఎస్సీ జనరల్, బిర్కూరు మండల కేంద్రంలో మరొకటి ఎస్టీ మహిళా, బీర్కూర్ మండలంలోని కిస్టాపూర్ అంగ వైకల్యం జనరల్, డోంగ్లి మండల కేంద్రంలో డోంగ్లి బీసీ మహిళ, జుక్కల్ మండలంలోని క్షేమ్రాజ్ కల్లాలి గ్రామానికి ఎస్సి మహిళ. మద్నూర్ మండలంలోని హండె కేలుర్ కు ఓసి జనరల్, మద్నూర్ మండల కేంద్రంలో మద్నూర్-2, ఓసి జనరల్, మద్నూర్ మద్నూర్-4 ఓసి మహిళ , మద్నూర్ -5 కు ఎస్సి జనరల్ , మద్నూర్ మండలం శేకాపూర్ గ్రామానికి ఎస్సి జనరల్ , మహమ్మద్ నగర్ మండలం లోని తున్కిపల్లి గ్రామానికి ఎస్సి జనరల్ , నసురుల్లాబాద్ దుర్కి బీసీ జనరల్, బస్వాయిపల్లి గ్రామానికి బీసీ జనరల్, నసురుల్లాబాద్ గ్రామానికి ఓసి మహిళ , దుర్కి గ్రామానికి ఎస్సి జనరల్, అంకోల్ గ్రామానికి ఎస్సి జనరల్ బొమ్మన్ దేవపల్లి గ్రామానికి బీసీ జనరల్, నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామానికి బీసీ జనరల్, బంజపల్లి గ్రామానికి, ఓసి జనరల్, జక్కాపూర్ గ్రామానికి అంగవైకల్యం జనరల్, పెద్ద కోడప్గల్ మండలంలోని పోచారం గ్రామానికి ఎస్టీ జనరల్, కస్లాబాద్ గ్రామానికి బీసీ జనరల్ రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది.
కేటాయించిన పౌరసర దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వీటికి అర్హత పదవ తరగతి (యస్.యస్.సి) పాసై ఉండాలి. దరఖాస్తు దారులు 18 సంవత్సరాల వయస్సు పై బడి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు దారుల పై ఎలాంటి సివిల్/క్రిమినల్ కేసులు ఉండి ఉండరాదు. (ఎస్సీ & ఎస్టీ లకు వయోపరిమితి వర్తించును.) దరఖాస్తు దారులు అతడు/ఆమె సంబందిత గ్రామ నివాసి అయి ఉండవలెను లేదా చౌకధరల దుకాణం ఏ గ్రామపంచాయతి పరిధిలో ఉన్నచో. ఆ గ్రామ పంచాయతి గ్రామానికి సంబందించిన వారు అయి ఉండాలి. స్థానికేతరులు దరఖాస్తు సమర్పించరాదు. పుట్టిన తేది, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా మరియు స్థానికతకి తగు ధ్రువ పత్రములను జతచేయవలెను.
రెవిన్యూ శాఖలో పని చేయు వారికీ దగ్గరి బందువు అయి ఉండరాదు. పౌరసరఫర సంస్థలో పని చేయు వారి బంధువులకు మరియు పంచాయత్ కార్యదర్శులకు బందువులై ఉన్న వారిని చౌక ధరల దుకాణం డీలర్ గా నియమించబడరు. గ్రామపంచాయత్ సర్పంచ్, మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్, సహకార సంఘ, సభ్యులు, మునిసిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, జడ్పిటిసి, ఎంపిటిసి సభ్యులు చౌకధరల దుకాణం డీలర్ కి అనర్హులు. చౌకధరల దుకాణం డీలర్ గా నియమించబడిన వ్యక్తి ఒకవేళ ఏదైనా ఒక గ్రామ పంచాయతీకి గాని మునిసిపాలిటికి కాని ఇతర ప్రజా సంబందమైన సంస్థలకు కాని ఎన్నిక అయినట్టు ఐతే వారిని డీలర్ గా తొలగించుటకు సమ్మతి పత్రం రాసి ఇయ్యవలెను.
డీలర్ గా నియమించిన వ్యక్తి తప్పకుండ 5 సంవత్సరములు పని చేయుటకు సిద్ధం అయి ఉండవలెను. లేనిచో వారు కట్టిన దరావత్ జప్తు చేయబడును. అభ్యర్థులు తగినంత ఆర్థిక స్తోమత కలిగి ఉండవలెను.దరఖాస్తు దారులు వారు దాఖలు చేయు సమయంలో వారు ఏ చౌకధరల దుకాణమునకు దరఖాస్తు చేయుచున్నారో కచ్చితంగా రాయవలెను. మరియు రిజర్వేషన్ వారికీ కేటాయించిన దుకాణములకు అట్టి దరఖాస్తు ని చేయవలెను.
