అనంతసాగర్ లో భూమి లో అక్రమ తవ్వకాలు జీవక కంపెనీ యజమాన్యం
చేగుంట జులై 18 సికే న్యూస్ రిపోర్టర్ ( కొండి శ్రీనివాస్ )
చేగుంట మండలం అనంతసాగర్ గ్రామం అనంతసాగర్ గ్రామ శివారులో గల జీవిక ఇండస్ట్రీస్ సర్వేనెంబర్ 402 గతంలో లావాని పట్టా పొలాన్ని 12 ఎకరాలు కొనుగోలు చేశారు దాన్ని ప్రభుత్వం అనంతసాగర్ గ్రామానికి కేటాయించగా ఇట్టి భూమిలో సర్కారి వాళ్లు క్రీడ ప్రాంగణాన్ని పల్లె ప్రకృతి వనాన్ని పనికార పథకాన్ని గత మూడు నాలుగు సంవత్సరాలుగా కొనసాగించారు
ఈ 402 సర్వే నెంబర్ గల స్థలంలో గతంలోనే జీవిత ఇండస్ట్రీస్ ఎలాంటి అనుమతులు లేకుండా కంపెనీని నిర్మించారు ఇదేంది ఇదేమీ న్యాయమని గ్రామస్తులు అడ్డుకోగా గతంలో ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చి కంపెనీని నడిపించారు
ఇప్పుడు మిగతా ఎనిమిది ఎకరాలలో కంపెనీ నిర్మాణానికి జెసిబి తో పని ప్రారంభించగా గ్రామస్తులు అడ్డుకున్నారు ఇదెక్కడి న్యాయమని గ్రామస్తులు నిలదీయగా మాకు టీజీ డబల్ ఐ సి నుండి పర్మిషన్స్ ఉన్నాయని తప్పుడు డాక్యుమెంట్స్ తో బెదిరిస్తున్నారు
దీనికై గ్రామస్తులు పై అధికారులకు ఫిర్యాదు చేయగా చెవిన పట్టినట్టు వ్యవహరిస్తున్నారు నాకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నామని గ్రామస్తులు బెదరబోయిన సిద్ధిరాములు ముత్యాలు రవీందర్ శంకర్ శ్రీరాములు దుర్గయ్య బిక్షపతి రమేష్ తదితరు గ్రామస్తులు మాట్లాడుతూ న్యాయం కావాలని కోరుతున్నారు