రాజీనామా మాట మార్చిన హరీష్ రావు
ఆగస్ట్ 15లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారని, ఆ సంగతేంటో ముందు చెప్పాలని సోషల్ మీడియాలో కాంగ్రెస్ హడావిడి చేస్తోంది.
రైతు రుణమాఫీని ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, తమ చిత్తశుద్ధి నిరూపించుకుంటోందని, హరీష్ రావు రాజీనామా చేసి తన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఈ ప్రశ్నలకు హరీష్ తాజాగా సమాధానమిచ్చారు. తానిప్పటికీ రాజీనామా ఛాలెంజ్ కి కట్టుబడి ఉన్నానని, అయితే తాను చెప్పినట్టుగా కాంగ్రెస్ అన్ని హామీలు అమలు చేయాలన్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలతోపాటు 13 హామీలను కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు హరీష్ రావు.
రైతు రుణమాఫీ సహా, అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా అమలు చేస్తామన్న హామీలన్నిటినీ నెరవేరిస్తే తాను తప్పకుండా రాజీనామా చేస్తానన్నారు హరీష్ రావు. ఆగస్ట్-15లోపు రుణమాఫీ పూర్తి చేయాలని, దానితోపాటు ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తనకు పదవి ముఖ్యం కాదని, తన పదవి పోయినా ప్రజలకు న్యాయం జరిగితే అదే సంతోషమని అన్నారు హరీష్ రావు.తన ఛాలెంజ