డబుల్ ఇస్మార్ట్’ పై వివాదం… పూరీ జగన్నాథ్‌పై కేసు నమోదు LB NAGAR : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి తాజాగా 'మార్ ముంత చోడ్ చింత' అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన 'ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి' అనే డైలాగ్ ను వాడారు. సాంగ్ లో …

డబుల్ ఇస్మార్ట్’ పై వివాదం… పూరీ జగన్నాథ్‌పై కేసు నమోదు

LB NAGAR : రామ్ పోతినేని – పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ పై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ సినిమా నుంచి తాజాగా 'మార్ ముంత చోడ్ చింత' అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ చెప్పిన 'ఇప్పుడేం చేద్దాం అంటావ్ మరి' అనే డైలాగ్ ను వాడారు. సాంగ్ లో కేసీఆర్ వాయిస్ ను ఉపయోగించడంతో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇందులో భాగంగానే డైరెక్టర్ పూరి జగన్నాథ్‌పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్‌ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా దీనిపై పలువురు బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సాంగ్ లో కేసీఆర్ వాడిన డైలాగ్స్‌ను తొలగించాలని డైరక్టర్ పూరీ జగన్నాథ్‌పై కేసు పెట్టారు. ‘ ఏదైతే పూరి జగన్నాథ్ గారు నిర్మించిన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ లో కేసీఆర్ గారి డైలాగును వాళ్ళ పాటలో హుక్ లైన్ గా వాడడం జరిగింది.

ఇది చాలా అభ్యంతరమైన విషయం. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. మా ప్రాంత యాస, భాషలను కించపరిచినా..

మా BRS అధినాయకుడిని కించపర్చిననా.. ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తూ, ఆ డైలాగును సాంగ్ నుండి రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నట్లు’ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated On 18 July 2024 11:04 AM IST
cknews1122

cknews1122

Next Story