గంజాయితో పట్టుబడిన యువకులు అరెస్ట్
సి కె న్యూస్ వాజేడు మండల ప్రతినిధి: షేక్ రహీమ్
నిన్నటి రోజు అనగా తేది: 19:07. 2024 మధ్యాహ్నం సుమారు 02:00 గంటల సమయంలో ఉన్నత అధికారుల ఆదేశాల మరకు పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చందుపట్ల గ్రామ శివారులో పొలాల వైపు వెళ్ళే దారిలో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వనిషేధిత గంజాయి త్రాగుతున్నారని సమాచారంతో పేరూరు ఎస్.ఐ తన సిబ్బందితో పాటు అక్కడికి వెళ్ళగా ఎనిమిది మంది వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించగా, వారు పోలీస్ వారిని చూసి పారిపోవు ప్రయత్నం చేయగా, అట్టి వ్యక్తులని మరియు మరొక ఐదుగురుని అరెస్ట్ చేశామని తెలిపారు .
వారిని తనికి చేయగా వారి వద్ద సుమారు 168 గ్రాముల గంజాయి దొరికింది. ఈ ఎనిమిది మందికి గంజాయి త్రాగే అలవాటు ఉందని అది త్రాగుట ద్వారానే అందరూ స్నేహితులు అయ్యారని తెలిపినారు. ఇట్టి వ్యక్తుల పై కేసు నమోదు చేసి వెంకటాపురం CI గారు విచారణ చేస్తున్నారు.
అదుపులోకి తీసుకోనివారి వివరాలు అడగగా వారి పేర్లు 1) జవ్వ గణేష్, 2) మారబోయిన శివ రామకృష్ణ 3) చాల్ల శ్రావణ్ కుమార్
పట్టుబడిన వారి వివరములు:
1) జవ్వ గణేష్ 5/౦ నాగయ్యవయస్సు R/o టికులగూడెం, వాజేడు మండలం, ములుగు జిల్లా,
2) మారబోయిన శివ రామకృష్ణు / ౦ సమ్మయ్య, R/O కనుకునూర్, మహాముత్తారం మండలం, జయశంకర్ చుపాలపల్లిజిల్లా,
3) చాట్ల శ్రావణ్ కుమార్ s/o పోచమల్లు, R/O కనుకునూర్, మహాముత్తారం మండలం, జయశంకర్ భూపాలపల్లిజిల్లా
మరియు ఐదుగురు
వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరములు
1) సుమారు 168 గ్రాములు గంజాయి బరువు,
21 స్మార్ట్ ఫోన్ లు- 7 & కి ప్యాడ్ మొబైల్ ఫోన్-01
మొత్తం స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ:
4200/- రూపాయలు మరియు స్మార్ట్ పోన్ లు- 7 కి ప్యాడ్ మొబైల్ ఫోన్-01
పోలీస్ వారి సందేశం
యువత చెడువ్యసనలకు బానికిలై బంగారు భవిష్యత్తు పాడుచేసుకోవద్దు, గంజాయి వంటి మత్తు పదార్థాలు సరఫరా చేసిన, సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని అదే విధంగా గంజాయి గురించి సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును అని తెలిపారు.