పార పట్టి రోడ్డుపై గుంటలు పూడ్చిన మధిర టౌన్ ఎస్ఐ సంధ్య..
▪️అకాల వర్షాలకు రోడ్డుపై పడిన గుంటలను కంకర్తో స్వయంగా పూడుస్తున్న ఎస్ఐ సంధ్య..
▪️కొద్దిసేపటి క్రితం మధిర -విజయవాడ రహదారి పెట్రోల్ బంక్ ఎదురుగా గుంటలో పడి గాయపడిన వ్యక్తి..
-ఈ వార్త సోషల్ మీడియాలో చూసిన టౌన్ ఎస్ఐ సంధ్య వెంటనే కంకర తెప్పించి గుంతలను స్వయంగా దగ్గరుండి పూడిపిస్తున్న వైనం..
▪️ *ప్రజల రాకపోకలకు *ఆటంకంగా మారిన గుంతలను మహిళా* ఎస్ఐ సంధ్య మానవత్వంతో పారబట్టిగుంటలనుపూడ్చి పలువురికిఆదర్శంగా నిలిచిన వైనం
▪️ అకాల వర్షాలకు ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంటలలో పడి వాహనదారులు కిందపడి ప్రమాదాలకు గురవుతున్న సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు మున్సిపాలిటీ వారు పట్టించుకోనప్పటికి మానవత్వంతో ఆలోచించి వెంటనే కంకరలోడ్ ట్రాక్టర్ ను తెప్పించి ఆమె వెంట ఉండి పారాబట్టి రహదారిపై పడిన గుంటలను పూడిపించిన టౌన్ ఎస్ఐ సంధ్య.
గత కొద్ది రోజులుగా మధిర పరిసర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ప్రధాన రహదారులపై గుంతలు పడటం ఆ గుంటల్లో నీరు నిల్వ ఉండటంతో కొంతమందికి ఆ గుంతలు కనిపించక ఆ గుంటల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు.
ఈ విషయాలు సోషల్ మీడియాలో చూసిన మధిర టౌన్ ఎస్ఐ స్పందించి తన సిబ్బందితో వెంటనే మధిర- విజయవాడ ప్రధాన రహదారులపై పడిన గుంతలను కంకర్తో పూడిపించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సంఘటన చూసిన స్థానికులు శభాష్ ఎస్ఐ సంధ్య అంటూ పలువురు కొనియాడారు. వారి స్పందించిన తీరును ప్రయాణికులు పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు.