మంత్రి పొంగులేటి చొరవతో కూసుమంచిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ
- ఈ విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి
- సోమవారం నుంచి అడ్మిషన్ల ప్రారంభం
సికే న్యూస్ ప్రతినిధి
ఖమ్మం : బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకముందే పాలేరు నియోజకవర్గాన్ని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, డ్రైనేజీలకు శంకుస్థాపనల చేయడం, మున్నేరుకు కరకట్ట నిర్మాణ పనులను ప్రారంభించడం , చెక్ డ్యాంల ఏర్పాటు అదేవిధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలకు శాశ్వత భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే మంత్రి పొంగులేటి చొరవ నేపథ్యంలో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ కూసుమంచి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డ్ కు ఆదేశాలు ఇస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024-25 ఏడాది నుంచే కళాశాల అందుబాటులోకి రావాలని ఆ జీవోలో పేర్కొన్నారు.
ఈ నెల 22 సోమవారం నుంచి విద్యార్థినీ,విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కూసుమంచిలో కళాశాల ఏర్పాటు పట్ల పాలేరు నియోజకవర్గానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.