రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన పెద్ద వాగు ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాల సందర్శన నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30గంటలకు …

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

  • పెద్ద వాగు ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాల సందర్శన
  • నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

సికె న్యూస్ ప్రతినిధి

ఖమ్మం: తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఉదయం 10.30గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ ను పరిశీలించి.. భారీ వర్షాలకు ఈ ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన లోతట్టు గ్రామాలను సందర్శిస్తారన్నారు.

సాయంత్రం నాలుగు గంటల నుంచి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో నూతన డ్రెయినేజీ నిర్మాణ పనులకు, బోదులబండ గ్రామం వద్ద రోడ్డు అభివృద్ధి పనులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రo ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని దయాకర్ రెడ్డి తెలిపారు.

ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Updated On 21 July 2024 5:03 PM IST
cknews1122

cknews1122

Next Story