మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి? వరంగల్ జిల్లా : స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తాటికొండ రాజయ్య కారు ఢీకొని శనివారం రాత్రి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కలకోట్ల స్వప్న (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన రాజయ్య కారు ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్రగాయాలు అయ్యాయి. దాంతో ఆమె …

మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి?

వరంగల్ జిల్లా :
స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. తాటికొండ రాజయ్య కారు ఢీకొని శనివారం రాత్రి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కలకోట్ల స్వప్న (40) అనే మహిళ రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన రాజయ్య కారు ఢీకొట్టడంతో స్వప్నకు తీవ్రగాయాలు అయ్యాయి.

దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. ప్రమాదం అనంతరం రాజయ్య కారులో నుంచి కిందికి దిగి రక్తపు మడుగులో పడి ఉన్న మృతురాలిని చూసి వెళ్లిపోయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

కాజీపేటలోని బాపూజీ నగర్‌లో తన కారును వదిలేసి మాజీ ఎమ్మెల్యే రాజయ్య వెళ్లిపోయినట్టు సమాచారం. కారు ఢీకొట్టిన సమయంలో నడిపింది ఎవరు అనేది స్పష్టత రాలేదు.

స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…

Updated On 21 July 2024 12:55 PM IST
cknews1122

cknews1122

Next Story