ఫ్యాషన్‌ డిజైనర్‌ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లిదండ్రులు.. ఇలాంటి పనులకు పాల్పడుతుంటే.. చుట్టూ ఉన్న వారు దీని గురించి సూటిపోటీ మాటలు అంటుంటే.. ఆ చిన్నారుల అనుభవించే మానసిక వ్యధ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమధ్య కాలంలో ఇలాంటి బంధాల వల్ల చోటు చేసుకునే నేరాలు కూడా పెరుగుతున్నాయి. వివాహేతర బంధాల వల్ల కట్టుకున్న వారిని, కన్నవారిని కూడా కడతేర్చడానికి రెడీ అవుతున్నారు కొందరు. ఇక …

ఫ్యాషన్‌ డిజైనర్‌ తో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

కంటికి రెప్పలా కాచుకోవాల్సిన తల్లిదండ్రులు.. ఇలాంటి పనులకు పాల్పడుతుంటే.. చుట్టూ ఉన్న వారు దీని గురించి సూటిపోటీ మాటలు అంటుంటే.. ఆ చిన్నారుల అనుభవించే మానసిక వ్యధ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈమధ్య కాలంలో ఇలాంటి బంధాల వల్ల చోటు చేసుకునే నేరాలు కూడా పెరుగుతున్నాయి. వివాహేతర బంధాల వల్ల కట్టుకున్న వారిని, కన్నవారిని కూడా కడతేర్చడానికి రెడీ అవుతున్నారు కొందరు.

ఇక కొన్ని సందర్భాల్లో ఇలాంటి బంధాల్లో ఉన్న వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని.. పోలీసులకు అప్పజెపుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హైదరాబాద్‌, బేగంపేట, లైఫ్‌స్టైల్‌ షాపింగ్‌ మాల్‌లో చోటు చేటు చేసుకుంది.

పెళ్లైన వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఓ ఫ్యాషన్‌ డిజైనర్‌ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది అతడి భార్య. ఈ ఘటనలో ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ బంధం గురించి భార్య అతడిని ప్రశ్నించగా.. నువ్వు ఎవరో నాకు తెలీదంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి చ​క్కా పోయాడు.

ఇక వివాహిత మహిళ.. సదరు ఫ్యాషన్‌ డిజైనర్‌ను ఆపి వారి బంధం గురించి ప్రశ్నించడమే కాక.. ఆమె వల్ల తన భర్త తనకు దూరం అయ్యాడని.. పిల్లలను పట్టించుకోవడం లేదని చెప్పుకొచ్చింది. అంతేకాక దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోనెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ సంఘటన బేగంపేట మెట్రో స్టేషన్‌ ఎదురుగా ఉన్న లైఫ్‌స్టైల్‌ షాపింగ్‌ మాల్లో చోటు చేసుకుంది. వీడియోలో ఉన్న దాని ప్రకారం ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్లస్టర్‌ మేనేజర్‌గా పని చేస్తోన​ శ్యామ్‌ సుందర్‌ బోనగాని అనే వ్యక్తికి సుమారు 15 ఏళ్ల క్రితమే వివాహం అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఇలా ఉండగా కొన్నాళ్ల క్రితం శ్యామ్‌ సుందర్‌కు స్థానికంగా ఉండే ఫ్యాషన్‌ డిజైనర్‌ అనితా సాగర్‌ అనే మహిళతో పరిచయం ఏర్పడి.. అది కాస్త వివాహేతర బంధానికి దారి తీసింది.

ఇలా ఉండగా నేడు అనగా సోమవారం, జూలై 22 నాడు శ్యామ్‌ సుందర్‌, అనిత ఇద్దరు బేగంపేట మెట్రో స్టేషన్‌ ఎదురుగా ఉన్న లైఫ్‌స్టైల్‌ షాపింగ్‌ మాల్‌కు వచ్చారు. ఇద్దరు మాల్లో ఉండగా.. శ్యామ్‌ సుందర్‌ భార్య.. తన స్నేహితులు, బంధువులతో కలిసి అక్కడకు వచ్చి.. భర్తను, అనితను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

దీనిపై శ్యామ్‌ సుందర్‌, అనితలను నిలదీయగా వారు మేం కేవలం స్నేహితులం.. షాపింగ్‌ కోసం వచ్చాం.. మీరే అనవసరంగా ఇక్కడ సీన్‌ చేస్తున్నారంటూ వాదించే ప్రయత్నం చేశారు.

ఇక భార్యను చూడగానే శ్యామ్‌ సుందర్‌ అక్కడ నుంచి జారుకోగా.. అతడి భార్య, ఆమెతో పాటు వచ్చిన వారు.. అనితను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె పరిచయం వల్లనే తన భర్త పిల్లలను, తనను పట్టించుకోవడం లేదని శ్యామ్‌ సుందర్‌ భార్య ఆవేదన వ్యక్తిం చేసింది.

కానీ సదరు ఫ్యాషన్‌ డిజైనర్‌ అనిత మాత్రం.. తాను, శ్యామ్‌ సుందర్‌ ఇద్దరం కేవలం స్నేహితులమేనని.. అనవసరంగా పబ్లిక్‌ ప్లేస్‌లో గొడవ చేయొద్దని వారిస్తూ.. మాల్‌ నుంచి వెళ్లిపోయే ప్రయ్నతం చేసింది. దాంతో శ్యామ్‌ సుందర్‌ భార్య వెంట వచ్చిన వారు పోలీసులకు కాల్‌ చేశారు.

Updated On 22 July 2024 3:55 PM IST
cknews1122

cknews1122

Next Story