వేతన జీవులను నిరాశ పరచిన కేంద్ర బడ్జెట్ —రాష్ట్రానికి నిధుల కేటాయింపు పై హర్షం. ఏపీ ఎన్జీజీఓ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు ఆనందబాబు పలమనేర్ నియోజకవర్గం, జూలై 22, సీకే న్యూస్. కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు తీవ్ర నిరాశ కల్పించిందని పలమనేరు తాలూకా ఏపీఎన్జీజీఓ సంఘం అధ్యక్షులు కె.ఆనందబాబు పేర్కొన్నారు. అధికశాతం మంది ఆదాయపు పన్ను కట్టే పాత విధానంలో ఎటువంటి సవరణలు చెయ్యకుండా, తక్కువ …

వేతన జీవులను నిరాశ పరచిన కేంద్ర బడ్జెట్ —
రాష్ట్రానికి నిధుల కేటాయింపు పై హర్షం.

ఏపీ ఎన్జీజీఓ సంఘం పలమనేరు తాలూకా అధ్యక్షుడు ఆనందబాబు

పలమనేర్ నియోజకవర్గం, జూలై 22, సీకే న్యూస్.

కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు తీవ్ర నిరాశ కల్పించిందని పలమనేరు తాలూకా ఏపీఎన్జీజీఓ సంఘం అధ్యక్షులు కె.ఆనందబాబు పేర్కొన్నారు.

అధికశాతం మంది ఆదాయపు పన్ను కట్టే పాత విధానంలో ఎటువంటి సవరణలు చెయ్యకుండా, తక్కువ శాతం మంది మాత్రం పన్ను కట్టే నూతన విధానంలో కొన్ని రాయితీలు కల్పించిన కేంద్ర నిర్ణయం వల్ల, ఉద్యోగ వర్గాలకు, పన్ను చెల్లింపు దారులకు ఎటువంటి ఉపశమనం కలగలేదని తెలిపారు.

అంతేకాక కోట్లాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే పాత పెన్షన్ పునరుద్ధరణపై ఎటువంటి సానుకూల ప్రకటన కూడా చెయ్యకపోవడం వల్ల ఉద్యోగ వర్గాలకు తీవ్ర అసంతృప్తి కలించే బడ్జెట్ గా ఉందన్నారు.

అయితే పీకల్లోతు కష్టాల్లో ఉన్న విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల అమలులో భాగంగా అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు, పరిశ్రమల స్థాపనకు, వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక నిధుల కేటాయింపులుకై బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించడంపై హర్షం వెలిబుచ్చారు.

Updated On 23 July 2024 3:34 PM IST
cknews1122

cknews1122

Next Story