మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేం సరిపోతాం.. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంగళవారం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ పలు అంశాలపై స్పందించారు. అలాగే, సభకు కేసీఆర్‌ రాకపోవడంపై స్పందించారు. దీనికి కేటీఆర్‌ ధీటుగా బదులు ఇచ్చారు. కేసీఆర్‌ గురించి, మా పార్టీ గురించి మాట్లాడే మాటలకు ఒకే సమాధానం చెబుతున్నానన్నారు. ఇక్కడుండే నాయకుడి స్థాయికి మేంచాలని.. కేసీఆర్ అవసరం లేదన్నారు. …

మీకు కేసీఆర్ అవసరం లేదు.. మేం సరిపోతాం.. కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మంగళవారం కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీర్మానానికి సంబంధించి ప్రభుత్వం చర్చను ప్రారంభించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ పలు అంశాలపై స్పందించారు.

అలాగే, సభకు కేసీఆర్‌ రాకపోవడంపై స్పందించారు. దీనికి కేటీఆర్‌ ధీటుగా బదులు ఇచ్చారు. కేసీఆర్‌ గురించి, మా పార్టీ గురించి మాట్లాడే మాటలకు ఒకే సమాధానం చెబుతున్నానన్నారు.

ఇక్కడుండే నాయకుడి స్థాయికి మేంచాలని.. కేసీఆర్ అవసరం లేదన్నారు. ఆయన వచ్చినా రాకపోయినా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుందని స్పష్టం చేశారు. మీ సత్తా కూడా తెలుసునని.. కేసీఆర్‌ అవసరం లేదని.. మీకు తాము సరిపోతామన్నారు. తమకు సమాధానం చెప్పాలన్నారు.

తీర్మానమని చెప్పారని ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సీఎం తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారని.. మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏదీ? అంటూ మంత్రి శ్రీధర్‌బాబును ప్రశ్నించారు. తీర్మానం లేకుండా చర్చ ఎక్కడున్నది ? ఇది స్వల్పకాలిక చర్చనా? తీర్మానమా? ఏం పెడుతున్నరో కూడా తెలియకుండా సభను నడుపుతున్నారని విమర్శించారు. దీనికి స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సభ్యుల అభిప్రాయాలను తీసుకొని ప్రవేశపెడుతామన్నారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడారు. తాము పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపామని.. తీర్మానం ప్రవేశపెట్టే ముందు సంప్రదాయం ఏంటంటే.. అసలు ప్రభుత్వం ఏం చెప్పదలచుకున్నది ? ఏ అంశంపై చర్చ చేయదలచుకున్నది ? దానికి సంబంధించి ప్రతులు అందరికీ పంచాలి.

ముఖ్యమంత్రి గతంలో మంత్రిగా పనిచేయలదని.. సభా వ్యవహారాలు అనుభవం లేకపోవచ్చన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి సీనియర్ అని.. గతంలో శాసనసభ వ్యవహారాలు నిర్వహించారన్నారు. తాము చర్చలో పాల్గొంటామని.. బ్రహ్మాండంగా అభిప్రాయం చెబుతామన్నారు.

ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఊడాలన్నారు. తాము సిన్సియర్‌గా చెబుతున్నామని తమ పార్టీ తరఫున సీఎం, శ్రీధర్‌బాబు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ స్వాగతిస్తున్నామని.. మద్దతిస్తామన్నారు.

అయితే, దీనికి స్పందించిన సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా మేనేజ్‌మెంట్‌ కోటా అనుకున్నానని.. అంతకంటే దారుణమంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు.

తాను జిల్లా పరిషత్‌, శాసన మండలి, శాసన సభ్యుడిగా, ఎంపీగా పని చేసిన.. ఇవాళ సీఎంగా పని చేస్తున్నానని.. స్వయంకృషి, కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలోకి వచ్చాం. అయ్య, తాతపేరు చెప్పుకొని రాలేదన్నారు. సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ఓపిక లేక రన్నింగ్‌ కామెంట్రీ అవసరమా? అని ప్రశ్నించారు.

తాను కూడా పేమెంట్‌ కోటాలో ముఖ్యమంత్రి పదవి కొట్టేసినవ్‌ అనొచ్చు.. మాట్లాడడం తాను కూడా మాట్లాడుతానన్నారు. అయ్యల పేర్లు చెప్పి పదవులు అంటే రాహుల్‌ గాంధీని అంటున్నడా? రాజీవ్‌ గాంధీని అంటున్నడా ? అనేది నాకు తెలియదన్నారు.

అయ్యల పేర్లు, మేనేజ్‌మెంట్‌ కోటా అని సభా నాయకుడు మాట్లాడొచ్చా? అంటూ నిలదీశారు. స్పీకర్‌ తమ హక్కులను కాపాడాలన్నారు. వారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉందన్నారు.

తాము ఇవాళ మేం స్పష్టంగా చెబుతున్నామని.. గవర్నమెంట్‌ ఏదైతే చర్చ ప్రారంభించిందో.. ఆ చర్చను స్వాగతిస్తున్నామన్నారు.

వందశాతం సమర్థిస్తున్నాం అని చెబుతున్నామని.. ఈ బిజినెస్‌లో తీర్మానం అని ఇచ్చారని గుర్తు చేశారు. సబ్జెక్ట్‌పై చర్చ ఉంటే.. చర్చకు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని.. అప్పుడే సభ్యులు సిద్ధమవుతారన్నారు.

మేం అధికార, ప్రతిపక్షంలో ఉన్నా ఏ పక్షంలో ఉన్నా మేం తెలంగాణ ప్రజల పక్షంమని.. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎందుకు సమర్థిస్తున్నాం. స్వాగతిస్తున్నాం అంటే.. తప్పకుండా విశాల ప్రయోజనాలు దృష్ట్యా మాత్రమేనన్నారు.

రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని.. కేంద్ర బడ్జెట్‌లో అన్యాయం జరిగింది కాబట్టి.. ప్రభుత్వం చర్చను పెట్టిందో సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని చెబుతున్నామన్నారు.

మరి ఈ విషయాన్ని అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి... ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావాలి అంటున్న అధికార పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు తెలంగాణ ప్రజలు.

Updated On 24 July 2024 9:05 PM IST
cknews1122

cknews1122

Next Story