నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ? హైదరాబాద్ : జులై 25బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం. గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చలో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి …

నేడు తొలిసారి అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ ?

హైదరాబాద్ : జులై 25
బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కెసిఆర్ తొలిసారి అసెంబ్లీకి రానున్నట్లు సమాచారం.

గురువారం ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో కెసిఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చలో పాల్గొననున్నట్లు తెలిసింది.

ప్రతిపక్షనాయకుడి హోదా లో కెసిఆర్ తొలిసారిగా సభకు హాజరుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కెసిఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరుకాలేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్‌ రెడ్డి,సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారి కెసిఆర్ అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడుతారోనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది..

Updated On 25 July 2024 12:28 PM IST
cknews1122

cknews1122

Next Story