పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్… రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేదు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మోగనున్న ఎన్నికల నగారా! గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధం.. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సీఎం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే సర్పంచ్ ల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావొస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలని అధికారులకు సూచించారు.
ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల పాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించిది ప్రభుత్వం.
పంచాయతీరాజ్ పై ముగిసిన సీఎం సమీక్ష
కొత్త ఓటరు జాబితాను ఆగస్టు మొదటివారంలోగా పూర్తి చేయాలని సూచించిన ముఖ్యమంత్రి.
ఓటరు జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్ ఇవ్వాలని బీసీ కమిషన్ కు సూచించిన సీఎం.
బీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం.
వీలైనంత త్వరగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.
ఈ నెల 4తో ఎంపీటీసీలు, జడ్పీటీసీల టర్మ్ ముగిసింది. మండల పరిషత్ ల బాధ్యతలను ఎంపీడీఓ పై ర్యాంక్ అధికారులకు, జిల్లా పరిషత్ ల బాధ్యతలను కలెక్టర్లు, అదరపు కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం.
మరి వేచి చూడాల్సిందే ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరు గెలుస్తారో…