మిత్రుడి పార్దీవదేహాన్ని చూసి కన్నీరుగా విలపించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు..
అసెంబ్లీ నుండి హుటాహుటీనా తరలివచ్చిన మంత్రి తుమ్మల..
జక్కంపూడి కృష్ణమూర్తికి నివాళులు అర్పించేందుకు భారీగా తరలివచ్చిన నాయకులు, ప్రజలు
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
*విగతజీవిగా ఉన్న తన ఆప్తమిత్రుడి పార్దీవాదేహాన్ని చూసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఇదే చివరి చూపు అని, ఇక చూసే అవకాశం లేనందునా మంత్రి కళ్ల వెంట నీళ్లు ఆగలేదు.
తన మిత్రుడిని కోల్పోయానని విషయం తెలుసుకున్న మంత్రి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పటికీ స్నేహం కోసం హుటాహుటినా హైదరాబాదు నుండి తరలివచ్చారు.
ఈ ఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ శనివారం తెల్లజాలవారుజామున తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల ఆయనను చూసేందుకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ హుటాహుటిన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మృతదేహానికి మంత్రి పూలమాలలు వేసి కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులకు భుజం తట్టి ధైర్యం కల్పించారు.
అనంతరం జక్కంపూడి కృష్ణమూర్తి అంతిమయాత్రలో మంత్రి పాల్గొన్నారు. కృష్ణమూర్తి మృతదేహాన్ని చూసేందుకు తల్లాడ మండలంతో పాటు జిల్లా నుండి వివిధ ప్రాంతాల నాయకులు భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రజలతోపాటు వివిధ గ్రామాల నుండి ఆయన అభిమానులు కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.