కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు..
ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి
ఢిల్లీలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లోకి భారీగా వరద నీరు వచ్చిం ది. కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు.
సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ముగ్గురి డెడ్ బాడీలను వెలికి తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కోచింగ్ సెంటర్ బేస్ మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుతుం డగా..ఒక్కసారిగా వరద పోటెత్తినట్లు తెలుస్తోంది.
పలువురు అభ్యర్థులు తాళ్ల సాయంతో రక్షించారు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఓల్డ్ రాజిందర్ నగర్ లో ఉణ్న ఐఏఎస్ స్టడీ సెంటర్ ఈ ఘటన జరిగింది.
వెంటనే 5 ఫైరింజన్లు ఘట నాస్థలానికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ స్థానిక పోలీసులు కలిసి చేపట్టిన సహాయక చర్యలతో ఇద్దరు మహిళ అభ్యర్థులు, ఒక యువకుని డెడ్ బాడీలను వెలికితీసినట్లు తెలిపారు.
ఈ ఘటనపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఢిల్లీ మంత్రి అతీషి ఆదేశాలు జారీ చేశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.