గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెండ్… జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గురుకుల స్కూల్‌లో శుక్రవారం ఆరపేటకు చెందిన రాజరపు ఘనాదిత్య అనుమానాస్పదంగా చనిపోగా, మరో ఇద్దరు స్టూడెంట్లు ఫకీర్‌ కొండాపూర్‌కు చెందిన గణేశ్‌, మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఘటనపై విచారణ జరపాలని మెట్‌పల్లి తహసీల్దార్‌ శేఖర్, తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కన్వీనర్ పి. శ్రీనివాస్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. స్టూడెంట్లకు సకాలంలో వైద్య సేవలు …

గురుకుల ప్రిన్సిపాల్‌ సస్పెండ్…

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల స్కూల్‌ ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. గురుకుల స్కూల్‌లో శుక్రవారం ఆరపేటకు చెందిన రాజరపు ఘనాదిత్య అనుమానాస్పదంగా చనిపోగా, మరో ఇద్దరు స్టూడెంట్లు ఫకీర్‌ కొండాపూర్‌కు చెందిన గణేశ్‌, మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్‌ అస్వస్థతకు గురయ్యారు.

దీంతో ఘటనపై విచారణ జరపాలని మెట్‌పల్లి తహసీల్దార్‌ శేఖర్, తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కన్వీనర్ పి. శ్రీనివాస్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. స్టూడెంట్లకు సకాలంలో వైద్య సేవలు అందించడంలో ప్రిన్సిపాల్‌ విఫలం అయ్యారని,

ఘటన సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా చేశారన విచారణాధికారులు కలెక్టర్‌కు రిపోర్టు ఇచ్చారు. దాని ఆధారంగా ప్రిన్సిపాల్‌ విద్యాసాగర్‌ను సస్పెండ్‌ చేస్తూ శనివారం రాత్రి కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

శానిటేషన్‌ నిర్వహణపై కలెక్టర్‌ ఆగ్రహం

పెద్దాపూర్‌ గురుకులాన్ని శనివారం కలెక్టర్‌ సందర్శించారు. ఓ స్టూడెంట్‌ మృతి, మరో ఇద్దరు అస్వస్థతకు గురి కావడంపై స్టూడెంట్లు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఒకే రూమ్‌లో క్లాస్‌, డార్మెటరీ నిర్వహించడం, వాటికి కిటికీలు లేకపోవడం, స్టూడెంట్లు నేలపైనే పడుకోవడం, శానిటేషన్‌ మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెసిడెన్షియల్‌ స్కూళ్లలో స్టూడెంట్ల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్డీవో నక్క శ్రీనివాస్‌ ఉన్నారు.

Updated On 28 July 2024 4:39 PM IST
cknews1122

cknews1122

Next Story