MuluguPoliticalTelangana

వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ

“ఫిర్యాదు దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి ఎఫ్ ఐ ఆర్ లను నిష్పక్షపాతంగా నమోదు చేయాలి”

“డయల్ 100 కాల్స్ కు సత్వరమే స్పందించాలి”

“గంజాయి సరఫరా ను అడ్డుకోవాలి వాహన తనిఖీలను మరింతగా పెంచండి”

“జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐ పి ఎస్”

“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”

ములుగు జిల్లా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్ పి డా. శబరిష్ ఐ పి ఎస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను పరిశీలించి కేసుల నమోదు, వాటి యొక్క స్థితి గతులను తెలుసుకుని పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు..

బాధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదును స్వీకరించిన అనంతరం వారికి వెంటనే రసీదు అందించాలని ఎఫ్ ఐ ఆర్ ను నిష్పక్షపాతంగా నమోదు చేయాలని రిసెప్షన్ డ్యూటీస్ లో ఫిర్యాదుదారుని పట్ల మర్యాదగా ప్రవర్తించాలని పోలీస్ స్టేషన్ వస్తే న్యాయం చేకూరుతుంది అనే విధంగా పని చేయాలనీ తెలియచేసారు..

నేర పరిశోధనలో ఇన్వెస్టిగేటివ్ అధికారి సాక్షాధారాలను సేకరించడంలో నైపుణ్యంగా వ్యవహరించాలని,VPO( గ్రామ పోలీసు అధికారి) గ్రామంలో గల ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు స్టేషన్ హౌస్ అధికారికి తెలియచేయాలనీ భాధిత వ్యక్తులు ఫిర్యాదు నిమిత్తం పోలీస్ స్టేషన్ వస్తే వారి సమస్యను విని వారికి న్యాయం చేస్తాం అనే నమ్మకం కలిగేలా ప్రవర్తించాలని ఎస్పీ తెలియజేశారు..

పోలీస్ స్టేషన్ ఆవరనలో గల నమోదు కాబడని మరియు వదిలివేయబడిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకొని పోలీస్ ఉద్యోగం అనేది భాద్యతతో కూడుకున్నదని క్రమశిక్షనతో ఉద్యోగం చేయాలనీ తెలియచేసారు..

ఈ కార్యక్రమంలో డిఎస్పీ ములుగు రవీందర్ సిఐ ములుగు శంకర్ ఎస్సై వెంకటాపూర్ సతీష్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button