తెలంగాణ రైతులకు రెండో రుణమాఫీ నిధులు విడుదల హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. రైతురుణమాఫీ రెండోవిడత ఈరోజు విడుదల చేసింది. రెండు విడత రుణ మాఫీలో భాగంగా లక్షన్నరలోపు ఉన్న వారికి రుణమాఫీ చేసింది. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ రుణమాఫీని విడుదల చేశారు.అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తాం రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ …

తెలంగాణ రైతులకు రెండో రుణమాఫీ నిధులు విడుదల

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది.

రైతురుణమాఫీ రెండోవిడత ఈరోజు విడుదల చేసింది. రెండు విడత రుణ మాఫీలో భాగంగా లక్షన్నరలోపు ఉన్న వారికి రుణమాఫీ చేసింది.

మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి ఈ రుణమాఫీని విడుదల చేశారు.అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తాం

రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్.

రాజకీయ ప్రయోజనం కాదు… రైతు ప్రయోజనం ముఖ్యమని పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి అభినందనలు.

రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించాం..

గత ప్రభుత్వం 60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ కూడా పూర్తిచేయలేకపోయారు.

గత ప్రభుత్వం రూ.25వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయింది.

అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారు.

ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందేనని ప్రణాళికలు రచించాం.. నిధులు సేకరించాం

నిధుల సమీకరణ చేసి ఇవాళ రెండో విడతలో రూ.6,198కోట్లు ఆరున్నర లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నాం..

ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత

నెహ్రూ ఆనాడు హరిత విప్లవం తీసుకు వచ్చారు.

జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లింది.

పేద రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయకరణ చేశారు.

సోనియమ్మ నేతృత్వంలో ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చారు.

ఆనాడు రూ.72వేల కోట్లు రుణాలు మాఫీ చేసి దేశంలో రైతులను ఆదుకుంది కాంగ్రెస్.

అప్పుడు .. ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతి.

నెల తిరిగేలోగా 1.5లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం.

అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తాం.

జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలు.

దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రికార్డు సృష్టించింది.

స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదు.

గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆరునెలల్లో ఆర్ధిక మంత్రి రూ.43 వేల కోట్లు వడ్డీ చెల్లించారు.

12 రోజుల్లోనే రుణమాఫీకి 12వేల కోట్లు సేకరించిన ఆర్ధిక మంత్రి, వారి సిబ్బందిని అభినందిస్తున్నా.

జిల్లాల వారీగా రుణమాఫీ పొందిన వారి వివరాలు చూస్తే..

నల్లగొండ జిల్లాలో 51వేల 515 రైతుల ఖాతాల్లో 514 కోట్లు జమ చేసింది సర్కార్.

నాగర్ కర్నూల్ జిల్లాలో 32వేల 406 రైతుల ఖాతాల్లో 312 కోట్లు,

సంగారెడ్డి జిల్లాలో 27వేల 249 రైతులకు 286 కోట్లు విడుదల చేసింది.

సిద్దిపేట జిల్లాలో 27వేల 875 రైతులకు 277 కోట్లు,

సూర్యాపేట జిల్లాలో 26వేల 437రైతులకు 250 కోట్లు కేటాయించింది.

ఖమ్మం జిల్లాలో 33వేల 942 రైతులకు 262 కోట్లు,

రంగారెడ్డి జిల్లాలో 24వేల ఏడుమంది రైతులకు 229 కోట్లు,

మెదక్ జిల్లాలో 22వేల 850మంది రైతులకు 216 విడుదల చేసింది తెలంగాణ సర్కార్.

ఇక వికారాబాద్ జిల్లాలో 23వేల 912మంది రైతులకు 240 కోట్లు రిలీజ్ చేసింది.

మహబూబ్‌నగర్ జిల్లాలో 22వేల 253మంది రైతులకు 219 కోట్లు,

నిజామాబాద్ జిల్లాలో 23వేల 769మంది రైతులకు 219 కోట్లు,

కరీంనగర్ జిల్లాలో 21వేల 785మంది రైతులకు 207 కోట్లు విడుదల చేసింది సర్కార్.

కామారెడ్డి జిల్లాలో 24వేల 816మంది రైతులకు 211 కోట్లు,

నిర్మల్ జిల్లాలో 18వేల 728మంది రైతులకు 196 కోట్లు,

యాదాద్రి భువనగిరి జిల్లాలో 18వేల 127మంది రైతులకు 177 కోట్లు విడుదల చేశారు.

జగిత్యాల జిల్లాలో 17వేల 903మంది రైతులకు 169 కోట్లను రుణమాఫీ కింద రిలీజ్ చేసింది ప్రభుత్వం.

Updated On 30 July 2024 3:19 PM IST
cknews1122

cknews1122

Next Story