HyderabadPolitical

ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన స్నేహితురాలిపై అత్యాచారం...

ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన స్నేహితురాలిపై అత్యాచారం...

ఎల్బీ నగర్ : ఉద్యోగం వచ్చిందని పార్టీ ఇచ్చిన చిన్ననాటి స్నేహితురాలిపై అత్యాచారం చేశారు. సంతోషంలో పార్టీ ఇచ్చిన ఆమెను మద్యం తాగించి రేప్ చేశారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో జరిగిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.

ఏసీపీ కాశీ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ కు చెందిన ఓ యువతి (24) కి ఇటీవల ఒక సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. హయత్ నగర్ లెక్చరర్ కాలనీకి చెందిన ఎడ్ల గౌతమ్ రెడ్డి (26).. బాధితురాలికి స్కూల్ మేట్. ఉద్యోగం వచ్చినందుకు పార్టీ ఇవ్వాలని యువతిని అతను ఒత్తిడి చేశాడు.

ఇందుకు యువతి అంగీకరించింది. సోమవారం సాయంత్రం స్నేహితుడికి పార్టీ ఇవ్వడానికి వనస్థలిపురానికి వచ్చింది. ఇద్దరూ కలిసి ఓంకార్‌ నగర్‌లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్‌కు వెళ్లారు.

రెస్టారెంట్‌లో గౌతమ్ రెడ్డి మద్యం తాగాడు. యువతికి కూడా బలవంతంగా మద్యం తాగించాడు. తరువాత రెస్టారెంట్ కింద ఉన్న హోటల్ గదిలోకి తీసుకెళ్లాడు. బాధితురాలు అప్పటికే మత్తులో ఉంది.

ఇదే అదునుగా ఆమెపై గౌతమ్‌ అత్యాచారం చేశాడు. అప్పటికే ఆ గదిలో గౌతమ్ రెడ్డి స్నేహితుడు మునగాల శివాజీ రెడ్డి (30) అలియాస్ చింటూ రెడ్డి ఉన్నాడు. అతను కూడా యువతిపై అత్యాచారం చేశాడు.

బాధితురాలి అరుపుతో పారిపోయిన నిందితులు

ఇద్దరు అత్యాచారం జరపడంతో యువతికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. సృహ నుంచి తేరుకున్న బాధితురాలు ఇద్దరిని చూసి కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది గదికి రావడంతో గౌతమ్ రెడ్డి, శివాజీ రెడ్డి పారిపోయారు.

బాధితురాలు తనకు జరిగిన ఘోరాన్ని తన స్నేహితులకు చెప్పడంతో వారు వనస్థలిపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని హాస్పిటల్‌కు తరలించారు. గౌతమ్ రెడ్డి, శివాజి రెడ్డిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button