వీధి సర్కస్ లు–
అగ్ని వలయాలే వారికి ఆలంబనాలు
సర్కస్ కళాకారులకు సామాజిక సేవ కార్యకర్త మధుమోహన్రావు చే చిరు సన్మానం
పలమనేరు నియోజకవర్గం, జూలై 31 సి కె న్యూస్
ఇప్పుడు వీధి సర్కస్లు కనుమరుగు అయిపోయిన కాలం.సర్కస్ కళాకారులకు ఆదరణ కరువైన రోజులు.
కానీ, ఈరోజు పలమనేరులో ఆ పాతరోజుల వీధి సర్కస్ చూడముచ్చట గొలిపింది.
ఒంటి చక్రపు సైకిల్ విన్యాసాలు, అగ్ని వలయాలలోఎగిరి అటువైపుకు, ఇటు వైపుకు దూకడం, ఇనుప వృత్తంలో ఇద్దరు నుండి ముగ్గురు దూరి బయటకు రావడం, దారం పైన నడవడం, లాంగ్ జంప్, హై జంప్ ఒక్కటేమిటి జిమ్నాస్టిక్స్ అని చెప్పవచ్చు. ఇలా ప్రదర్శించి అందరి మెప్పులు పొందిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సైకిల్ సర్కస్.
సర్కస్ వారు మాట్లాడుతూ…. మా పూర్వీకుల నుండి వచ్చిన విద్య అని, దానిని ప్రదర్శించి మేము పొట్ట నింపుకుంటున్నామని, ప్రతి ఊరిలో ఈ విధంగా ప్రదర్శనలు ఇచ్చి వారిచ్చిన కానుకలు తీసుకుంటున్నామని వారు తెలియజేశారు.
ఈ సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మధుమోహన్రావు వారికి శాలువా కప్పి నగదు,భోజనము ఇచ్చారు.
మధుమోహన్రావును సర్కస్ వారు పొగడ్తలతో ముంచెత్తారు.
మేము ఎంత కష్టపడినప్పటికీ, మా దగ్గరకు చాలామంది రారు.అటువంటిది మధుమోహన్రావు మమ్మల్ని ఆప్యాయంగా పలకరించి, మాకు చిరు సత్కారం చేసినందుకు సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా సర్కస్ వారు తెలియజేశారు.