ఖాకీలు కూడా దేకట్లే! ఎంపీ అర్వింద్ సెటైర్లు… Hyderabad : బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో నిరసనలు చేశారు. ఎమ్మెల్యేలు నిరసనలు చేయడంతో స్పీకర్ వాళ్లకు మైక్ ఇవ్వలేదు.దాంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్స్ …

ఖాకీలు కూడా దేకట్లే! ఎంపీ అర్వింద్ సెటైర్లు…

Hyderabad : బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గురువారం అసెంబ్లీలో నిరసనలు చేశారు.

ఎమ్మెల్యేలు నిరసనలు చేయడంతో స్పీకర్ వాళ్లకు మైక్ ఇవ్వలేదు.దాంతో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం సీఎం ఛాంబర్ ముందు బైఠాయించారు.

ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు.

అనంతరం అసెంబ్లీ ముందు రోడ్డుపై నిరసనలు చేయడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, అసెంబ్లీలో కేటీఆర్‌ను మార్షల్స్ బయటకు ఎత్తుకెళ్తున్న వీడియో సోషల్ మీడయాలో వైరల్‌గా మారింది.

ఈ క్రమంలోనే బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేటీఆర్ అరెస్ట్ వీడియో పోస్ట్ చేశారు. 'అప్పుడు.. కన్ను మిన్ను కనపడలే ! ఇప్పుడు.. ఖాకీలు కూడా దేకట్లే' అని అర్వింద్ సెటైర్లు వేశారు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ గా మారింది.

Updated On 1 Aug 2024 11:00 PM IST
cknews1122

cknews1122

Next Story