పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన సికె న్యూస్ ప్రతినిధి పాలేరు : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండలంలోని ఈశ్వరమాదారం గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని, రాజుపేటలో విజయ రెడ్డి కుటుంబాన్ని, జుజ్జుల్ రావుపేటలో శేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి కుటుంబాలను, గొరిల్లా పాడు తండాలో తేజవత్ పీటర్ నాయక్ కుటుంబాన్ని, కూసుమంచిలో చెన్ను వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కూసుమంచి …

పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

సికె న్యూస్ ప్రతినిధి

పాలేరు : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కూసుమంచి మండలంలోని ఈశ్వరమాదారం గ్రామంలో సూర్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని, రాజుపేటలో విజయ రెడ్డి కుటుంబాన్ని, జుజ్జుల్ రావుపేటలో శేఖర్ రెడ్డి, నర్సింహారెడ్డి కుటుంబాలను, గొరిల్లా పాడు తండాలో తేజవత్ పీటర్ నాయక్ కుటుంబాన్ని, కూసుమంచిలో చెన్ను వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శీనన్న నిరుద్యోగ కానుక ఉచిత క్యాంపు పోస్టర్ ను రైట్ ఛాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం నేలకొండపల్లి మండలంలో చావా లెనిన్ బాబు దశదిన కర్మకు హాజరై నివాళులు అర్పించారు.

అనంతనగర్ లోని గురుకుల పాఠశాలలో పియస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలంలోని సాయిగణేష్ నగర్ లో గల క్యాంపు కార్యాలయంలో నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కలిశారు.

Updated On 3 Aug 2024 5:38 PM IST
cknews1122

cknews1122

Next Story