కేటీర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ మరో సంచలన పోస్ట్ మాజీ మంత్రి కేటీఆర్‌ కు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికార మదంతో అధర్మంగా దాడులు చేస్తే..సృష్టిధర్మం తన పని తాను చేస్తుందంటూ పోస్ట్‌ చేశారు. సబితా ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్‌, డిప్యుటీ భట్టి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రీసెంట్‌గా ధర్నా చేశారు. అసెంబ్లీలో సీఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మార్షల్స్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను …

కేటీర్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ మరో సంచలన పోస్ట్

మాజీ మంత్రి కేటీఆర్‌ కు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కౌంటర్‌ ఇచ్చారు. అధికార మదంతో అధర్మంగా దాడులు చేస్తే..సృష్టిధర్మం తన పని తాను చేస్తుందంటూ పోస్ట్‌ చేశారు.

సబితా ఇంద్రారెడ్డి పై సీఎం రేవంత్‌, డిప్యుటీ భట్టి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రీసెంట్‌గా ధర్నా చేశారు.

అసెంబ్లీలో సీఎం ఛాంబర్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో మార్షల్స్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను అమాంతం ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు.

కేటీఆర్ సహా మిగిలిన ఎమ్మెల్యేలను తెలంగాణ భవన్‌ కు తరలించారు. ఇదే వీడియోను ఓ పాట యాడ్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు ఎంపీ అరవింద్‌. గతంలో అరవింద్‌ కాన్వాయ్‌పై కొందరు బీఆర్ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు.

ఈ దాడిలో అరవింద్‌ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిపై అప్పట్లో బీజేపీ తీవ్రంగా స్పందించింది. అప్పటి దాడి వీడియోలను కూడా అరవింద్ ఇప్పుడు పోస్ట్‌ చేసిన వీడియోలో ప్రస్తావించారు.

బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంలో ప్రతిపక్షం మీద ఇలాగే దాడులు చేయించారు. ఇప్పుడు వేరే ప్రభుత్వంలో మీకు కూడా అదే పరిస్థితి వచ్చింది అనే మీనింగ్‌ వచ్చేలా వీడియోను ఎడిట్‌ చేసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

అధికారమదంతో అధర్మంగా దాడులు చేస్తే, సృష్టిధర్మం తన పని తాను చేస్తుంది. తాట తీస్తుంది. సరదా తీరుస్తుంది అంటూ ట్యాగ్‌ లైన్‌ కూడా ఇచ్చారు. అరవింద్‌ కేటీఆర్‌కు ఇచ్చిన ఈ కౌంటర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Updated On 4 Aug 2024 1:05 PM IST
cknews1122

cknews1122

Next Story