KhammamPoliticalTelangana

కబ్జాదారులను బొక్కలో వేయండి

కబ్జాదారులను బొక్కలో వేయండి

కబ్జాదారులను బొక్కలో వేయండి

  • రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు
  • ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు తీసుకొండి
  • గంజాయి విక్రయాలపైనా ఉక్కు పాదం మోపండి
  • సీపీ సునీల్ దత్ కు మంత్రి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు

కూసుమంచి : రైతుల భూములు ఆక్రమించుకుంటూ వారి ఆత్మహత్యలకు కారణమవుతున్న కబ్జాదారులను బొక్కలో వేయాలని… వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు పూనుకోవాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాలు జారీచేశారు.

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ఖమ్మం సీపీ ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు సంబంధించిన పలు అంశాలపై వారిరువురు చర్చించారు.

తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నా వారిపై దృష్టి సారించాలని సీపీకి సూచించారు. కొంతమంది ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించారని వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతున్నారని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ ఠాణాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఖచ్చితంగా అమలవ్వాలని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button