జక్కంపూడి కృష్ణమూర్తి, ప్రేమలత దంపతులకు మంత్రి పొంగులేటి నివాళి
సికే న్యూస్ ప్రతినిధి
తల్లాడ: ఇటీవల అనారోగ్యంతో సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి ప్రాణాలొదలగా.. అది తట్టుకోలేక ఆయన సతీమణి ప్రేమలత హఠాన్మరణం చెందడంతో.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం బిల్లుపాడు గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి ఘన నివాళులర్పించారు.
ఆ దంపతుల చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తూ.. తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి.. ధైర్యం చెప్పారు.
నారాయణపురం గ్రామంలో..: రెడ్డెం వీర నరసింహారెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయన చిత్రపటం వద్ద మంత్రి పొంగులేటి నివాళి అర్పించారు.
ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ బాబు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మట్టా దయానంద్, తుళ్లూరి బ్రహ్మయ్య, నాయకులు రఘుపతి రెడ్డి, కాప సుధాకర్, రాయల రాము, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, యేర్రి నరసింహారావు, తుమ్మలపల్లి రమేష్, జనార్దన్ రెడ్డి, తూము వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.