బంగారం దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ…?
మహిళపై థర్డ్ డిగ్రీ పై స్పందించిన నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్..
మహిళను దారుణంగా కొట్టిన పోలీసులు
TG: షాద్నగర్ పీఎస్లో ఓ ఎస్సీ మహిళను పోలీసులు దారుణంగా కొట్టడంపై విమర్శలొస్తున్నాయి. బంగారం దొంగలించారన్న ఆరోపణలతో బాధిత మహిళను పీఎస్కు తీసుకెళ్లిన పోలీసులు, ఆమెపై కేసు నమోదు చేశారు.10 రోజులు గడిచినా రిమాండ్ చేయలేదు.
తర్వాత ఇంటికి పంపారు. దొంగతనం ఒప్పుకోవాలని పోలీసులు తనను తీవ్రంగా కొట్టారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సీఐ రాంరెడ్డిని బదిలీ చేశారు.
ఈ ఘటనపై నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ తీవ్రంగా ఖండించారు. ఇలా మహిళలపై పోలీసు వారు థర్డ్ డిగ్రీ ఇవ్వడం అమానుషం అంటూ నేషనల్ నింబల్ హ్యూమన్ రైట్స్ సీనియర్ ప్రెసిడెంట్ డాక్టర్ పీటర్ నాయక్ లకావత్ ఖండించారు.