ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ముఖ్యమంత్రి పలమనేరు నియోజకవర్గం, ఆగస్టు 4, సి కె న్యూస్ ప్రతినిధి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. . ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. అమర్నాథ్ రెడ్డి తండ్రి గారు మా తండ్రిగారు మంచి మిత్రులని, నేను అమర్నాథ్ రెడ్డి అదే విధమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, …

ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ముఖ్యమంత్రి

పలమనేరు నియోజకవర్గం, ఆగస్టు 4, సి కె న్యూస్ ప్రతినిధి

ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…. అమర్నాథ్ రెడ్డి తండ్రి గారు మా తండ్రిగారు మంచి మిత్రులని, నేను అమర్నాథ్ రెడ్డి అదే విధమైన స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, శాసన సభ్యులుగా ఇద్దరు చాలా సంవత్సరాలు పనిచేశామని, ఆయన తెలియజేశారు.

కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.... జనసేన, బిజెపి తెలుగుదేశం, కూటమిగా ఏర్పడి, ప్రజలు ఇచ్చిన అబ్సల్యూట్ మెజారిటీతో, అధికారంలోకి రావడం జరిగింది అని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ నుఅన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నదని తెలియజేశారు.

దేశంలోనే అతిపెద్ద మరియు గొప్ప ప్రాజెక్టు పోలవరమని, పోలవరం పూర్తయితే, 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు మరియు గోదావరిలో10 లక్షల ఎకరాలకు స్థిరీకరణ, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల ఎకరాలకు స్థిరీకరణ.

మొత్తంగా 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ మరియు 7,20,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, అంతేకాకుండా ... 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే కరెంట్ యూనిట్ 10 నుండి 15 పైసలకే తయారు చేయవచ్చని , కృష్ణ వాటర్ మన రాయలసీమకు అందుతుందని, ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం సమర్ధంగా సరిచేసి, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రభుత్వం ఉంటుందని, ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ…. కీలపట్ల దేవస్థానం టిటిడి పరిధిలో తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలపట్ల దేవస్థానాన్ని టిడిపి పరిధిలో తేవడం జరిగిందని, ఈరోజు కీలపట్ల దేవస్థానం ఎంత అభివృద్ధి అయిందో మనమందరం చూస్తూనే ఉన్నామని, సందర్భంగా అమర్నాథ్ రెడ్డి తెలియజేశారు.

ఈ సందర్భంగా కీలపట్లకు వెళ్లడానికి దారి సింగిల్ రోడ్డు గా ఉందని, దాన్ని డబుల్ రోడ్డు చేస్తే ఇంత ప్రాచీనమైన గుడి మరింత అభివృద్ధి చెందుతుంది అని విలేకరులు ప్రస్తావించగా.. కచ్చితంగా ఆ రోడ్డు వెడల్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఈ సందర్భంగా రెడ్డి హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్బిసి కుట్టి, ఆర్ వి బాలాజీ, గిరి తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated On 4 Aug 2024 3:21 PM IST
cknews1122

cknews1122

Next Story