కస్తూర్బాలో 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్… తక్షణమే కస్తూర్బా ఎస్ఓ నీ సస్పెండ్ చేయాలి సీకే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి: 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ హాస్టల్ లో నాసీరకమైన భోజనమే కారణం తక్షణమే ఎస్ ఓ ,వార్డెన్ , సంబంధిత అధికారులను ,సస్పెండ్ చేయాలీ ఉన్నత అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కొల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ సులిగిరి తరుణ్ పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా …

కస్తూర్బాలో 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్…

తక్షణమే కస్తూర్బా ఎస్ఓ నీ సస్పెండ్ చేయాలి

సీకే న్యూస్ ప్రతినిధి, పెంట్లవెల్లి:

  • 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
  • హాస్టల్ లో నాసీరకమైన భోజనమే కారణం
  • తక్షణమే ఎస్ ఓ ,వార్డెన్ , సంబంధిత అధికారులను ,సస్పెండ్ చేయాలీ
  • ఉన్నత అధికారులు వారిపై తగిన చర్యలు తీసుకోవాలి
  • భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కొల్లాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ సులిగిరి తరుణ్

పెంట్లవెల్లి మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా హాస్టల్ లో ఆదివారం ఒకేసారి 25 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడం చాలా దారుణమని విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ కొల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు సులిగిరి తరుణ్ తెలిపారు

అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పాడైపోయిన, కుల్లి పోయిన, కూరగాయలను వండడం ద్వారా, ఇలాంటి పరిస్థితి ఇక్కడ చోటుచేసుకుందని ఆయన తెలిపారు

పాడైపోయిన కూరగాయలు, వాటిపై ఈగలు దోమలు వాలినటువంటివి, వాటితో వంట వండడం వలన ఈ ఘటన జరిగిందని ఆయన తెలిపారు వీటికి కారణం హాస్టల్ ఎస్ ఓ నిర్లక్షమేననీ ఆయన మండిపడ్డారు అలాగే స్థానిక మంత్రి ఇలా కాలో ఇలా జరగడం చాలా ఘోరమని ఆయన మంత్రి జూపల్లి నీ విమర్శించారు

అలాగే సంబంధిత హాస్టల్ ఎస్ ఓ నీ , వార్డెన్ ను , తక్షణమే సస్పెండ్ చేయాలని ఆయన అధికారులను కోరారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం తగదనీ వారికి నాణ్యమైన భోజనం అందించకుండా నాసీరకమైనా భోజనం పెట్టడం వలనే ఈ సమస్య ఏర్పడిందనీ ఆయన అధికారులపై ,ఎస్ ఓ, హాస్టల్ వార్డెన్, పై సీరియస్ అయ్యారు తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలనీ ఆయన కోరారు

Updated On 4 Aug 2024 11:17 PM IST
cknews1122

cknews1122

Next Story