ప్యారీస్ ఒలింపిక్స్ నుంచి వినేశ్ ఫొగట్ డిస్‌క్వాలిఫై??
50 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం నుంచి ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగట్ ఒలింపిక్స్ నుంచి డిస్‌క్వాలిఫై అయినట్లు సమాచారం. నిర్దేశించిన బరువు కంటే ఎక్కువ ఉండటంతో ఒలంపిక్ నిర్వాహకులు ఆమెను ఫైనల్ ఆడనివ్వకుండా నిషేధించినట్లు తెలుస్తోంది.
పైగా ఆమెకు ఎటువంటి మెడల్ కూడా ఇవ్వరు. ఫ్రీ స్టైల్ 50 కేజీల విభాగంలో గోల్డ్, బ్రాంజ్ మాత్రమే ప్రదానం చేయనున్నారు. ఒలంపిక్ నిర్వాహక కమిటీ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
తన విభాగంలో నిర్దేశించిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. సాధారణంగా 50 కేజీల విభాగంలో ఉన్న వాళ్లు 52 కేజీల బరువు వరకు ఉండొచ్చు.
కానీ వినేశ్.. అంత కంటే 100 గ్రాములు ఎక్కువ ఉన్నది. రాత్రంతా మేలుకొని స్కిప్పింగ్, రన్నింగ్ చేసినా లాభం లేక పోయింది. భారత మేనేజ్‌మెంట్ మరి కొంత సమయం ఇవ్వాలని కోరినా ఒలంపిక్ కమిటీ వినలేదని తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.