పాఠశాల బస్సును ఢీకొట్టిన ట్రాలీ ఆటో
ఆటో నడుపుతున్న వ్యక్తులకు తీవ్ర గాయాలు
దర్యాప్తు జరుపుతున్న పోలీసులు
పెబ్బేరు ఆగస్టు08 (సీ కే న్యూస్)
ఆగి ఉన్న పాఠశాల బస్సును ట్రాలీ ఆటో ఢీ కొట్టిన సంఘటన పెబ్బేరు మండలం రంగాపురం గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై చోటు చేసుకుంది.
స్థానికుల తెలిపిన వివరాలు ప్రకారం.కర్నూల్ వెైపు వెళ్తున్న ట్రాలీ ఆటో పెబ్బేరు మండలం రంగాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న మాంటిస్సోరి ప్రవేట్ పాఠశాల బస్సును ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థులకు చిన్న చిన్న గాయాలు కాగా ఆటో నడుపుతున్న డ్రైవర్ వెంకటేష్ తో పాటు మహేంద్ర,గురుస్వామి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
108 వాహనం ద్వారా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నేషనల్ హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రులు డోన్ కు సంబంధించిన వారిగా సమాచారం. ఈ సంఘటనపై ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్సై హరిప్రసాద్ రెడ్డి తెలిపారు