మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో మహిళపై లాఠీ ఛార్జ్ లాఠీతో కొట్టిన ఏఎస్సై చేయి చేసుకున్న హెడ్​ కానిస్టేబుల్​ రోడ్డు వెంబడి వెళ్తూ వీడియో తీసి వైరల్ ​చేసిన వ్యక్తి జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్​లో ఓ మహిళపై ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టడమే కాకుండా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. పట్టణంలోని గోల్ హనుమాన్ ఏరియాలో ఉండే భార్యాభర్తలు గొడవ పడి …

మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో మహిళపై లాఠీ ఛార్జ్

లాఠీతో కొట్టిన ఏఎస్సై

చేయి చేసుకున్న హెడ్​ కానిస్టేబుల్​

రోడ్డు వెంబడి వెళ్తూ వీడియో తీసి వైరల్ ​చేసిన వ్యక్తి

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పోలీస్ స్టేషన్​లో ఓ మహిళపై ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్ లాఠీతో కొట్టడమే కాకుండా చేయి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

పట్టణంలోని గోల్ హనుమాన్ ఏరియాలో ఉండే భార్యాభర్తలు గొడవ పడి గురువారం మెట్​పల్లి పీఎస్​కు వచ్చారు. పీఎస్ ​ఆవరణలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.

దీంతో అక్కడే ఉన్న ఏఎస్సై ఆంజనేయులు లాఠీతో సదరు మహిళను నాలుగు దెబ్బలు కొట్టాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ అశోక్​ కూడా ఆమెపై చేయి చేసుకుని అక్కడి నుంచి తరిమేశాడు.

ఈ ఘటనను రోడ్డుపై నుంచి వెళ్తున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్​చేశాడు. ఎస్సై చిరంజీవి వివరణ కోరగా స్టేషన్ ఆవరణలో భార్యాభర్తలు కొట్టుకోవడంతో వారిని సముదాయించి పంపించేశారని అన్నారు.

Updated On 10 Aug 2024 11:15 AM IST
cknews1122

cknews1122

Next Story