పోటెత్తిన వరద నీరు… కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో హోస్పెట్‌లోని తుంగభద్ర డ్యామ్‌కు వదరనీరు పొటెత్తింది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమమంలో డ్యామ్ 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్యాం నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అయితే, డ్యామ్‌కు ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు …

పోటెత్తిన వరద నీరు… కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు

కర్ణాటక, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో హోస్పెట్‌లోని తుంగభద్ర డ్యామ్‌కు వదరనీరు పొటెత్తింది. ఈ క్రమంలోనే రాత్రి 11 గంటల సమమంలో డ్యామ్ 19వ గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

చైన్ లింక్ తెగిపోవడంతో గేటు వరద నీటిలో కనిపించకుండా పోయినట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో డ్యాం నుంచి 75 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.

అయితే, డ్యామ్‌కు ఇన్ ఫ్లో తగ్గడంతో గేట్లు మూసేందుకు ప్రయత్నించగా.. 19వ గేట్ మూసే సమయంలో చైన్ లింక్ తెగి వరద నీటిలో గేటు కొట్టుకుపోయింది.

ఇక చేసేదేమి లేక అధికారులు అన్న గేట్లును ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేశారు.

డ్యామ్ పరిస్థితిని పరిశీలించేందుకు కర్ణాటక మంత్రి శివరాజ్ స్పాట్‌కు చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా డ్యామ్ పరిస్థితిని సమీక్షించేందుకు చెన్నై, బెంగళూరు నుంచి నిపుణుల బృందం రానుంది.

Updated On 11 Aug 2024 10:59 AM IST
cknews1122

cknews1122

Next Story