ప్రజావాణిలో రైతు ఆత్మహత్యాయత్నం…
పార్ట్ బి లో ఉన్న భూమికి 20వేల లంచం..ఆర్ ఐ నిర్వాహకం
పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలోని ప్రజావాణిలో సోమవారం వడ్లం గ్రామానికి చెందిన రైతు గైని అంజయ్య పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
వివరాల్లోకెళ్తే… వడ్లం గ్రామ శివారులో 134 /3 సర్వే నంబర్ లో గల 3-14 గుంటల భూమి మా అన్నదమ్ముల పేరిట ఉంది.
ఇట్టి భూమిని తన పేరు చేయమని ఆర్ఐ వద్దకు గత ఆరు నెలల క్రితం వెళ్ళారు.ఆర్ఐ పండరి ఇది పార్ట్ బి లో ఉంది 20 వేల రూపాయలు ఇస్తే పార్ట్ బీ లో నుంచి తొలగించి పట్టా చేసి పాస్ బుక్ ఇస్తానని అన్నారు.
గత ఆరు నెలల నుంచి తన చుట్టూ తిప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.పనులన్నీ వదులుకొని కార్యాలయం చుట్టూ,ఆర్ ఐ చుట్టు తిరుగుతున్న పని చేయడం లేదు.ఆర్ ఐ పండరి పట్టాదారు పుస్తకం అడిగితే నేడు రేపు అంటూ ఇబ్బందుల గురి చేస్తున్నారు. జులై 31న ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు.
కార్యాలయం చుట్టూ తిరగలేక డబ్బులు లేక దీంతో విసుకు చెందిన గైని అంజయ్య సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుండగా తాసిల్దార్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మ అత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే స్థానికులు రైతును చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ వివరణ : గత నెల జులై 31లో ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది వాస్తవమే కానీ ఆర్.ఐ పండరి తీసుకున్న డబ్బుల విషయం నా దృష్టికి రాలేదని ఇలాంటి ఏదైనా పై అధికారులకు తెలిపి చట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.