చెవిలో ఫోన్, చంకలో హీటర్.. ప్రాణం తీసిన ఫోన్ ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి ఖమ్మం - స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు. ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. …
![చెవిలో ఫోన్, చంకలో హీటర్.. చెవిలో ఫోన్, చంకలో హీటర్..](https://cknewstv.in/wp-content/uploads/2024/08/images-1-10.jpeg)
చెవిలో ఫోన్, చంకలో హీటర్..
ప్రాణం తీసిన ఫోన్
ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ చంకలో పెట్టుకున్న వ్యక్తి.. షాక్ కొట్టి మృతి
ఖమ్మం - స్థానిక కాల్వ ఒడ్డునున్న హనుమాన్ గుడి సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు (40) ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడినీళ్ల కోసం హీటర్ ఆన్ చేయబోయారు.
ఈలోగా ఫోన్ రావడంతో మాట్లాడుతూ.. హీటర్‌ను నీటిలో బదులు చంకలో పెట్టుకుని స్విచ్ ఆన్ చేశారు. దీంతో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయారు.
దీంతో అప్రమత్తమైన భార్య దుర్గాదేవి మహేశ్ బాబును ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)