ఎటువంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలి
బిజెపి కిషన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్
సీకే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గ బాధావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు లో బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రతి రైతుకు బ్యాంకు రుణమాఫీ డిసెంబర్ 9, 2023 తేదీన ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా చేస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినది ,
కానీ భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం కావడంతో పట్టాదారు పాస్ బుక్ లు లేవు ఎక్కువ మంది రైతులకు పహాని నకల్ మీద రుణం తీసుకున్నారు, మాఫీ కాలేదు, గత 15 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో లక్షల మందికి రేషన్ కార్డు లు లేవు కావున వీరికి మాఫీ కాలేదు ,రెండు లక్షల దాటిన రైతుకు బ్యాంక్ అప్పు ముందు కడితే తర్వాత మాఫీ చేస్తామన్నారు,
కానీ చాలామంది రైతులు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాక బ్యాంకులు ఒత్తిడి వల్ల బ్యాంకులకు వెళ్లి వాళ్ళ అప్పును రెన్యువల్ చేయించుకున్నారు, ఇప్పుడు ఎలా కడతారు కావున బ్యాంక్ రుణం రెన్యువల్ చేయించుకున్న రైతులకు అప్పుతో సంబంధం లేకుండా 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలి,
అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తా అన్నావ్ రైతుకు ఎంత ఉన్న సరే రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలి, ఆగస్టు 15 లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి దేవుని మీద ఒట్టు పెట్టినారు కానీ ఆగస్టు 15 నాటికి 50 శాతం మంది రైతులకు కూడా మాఫీ కావట్లేదు, ఖరీఫ్ లో రైతు భరోసా జూన్లో వేయాల్సింది
ఆగస్టు నెల కూడా ఇంతవరకు రైతు భరోసా వేయలేదు, రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయలేదు, కౌలు రైతులకు కూడా 15000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది,
కావున కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసే వరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది కావున తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలన్నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి అని చిలుకూరి రమేష్ డిమాండ్ చేసినారు.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చే నీళ్లు ఈ ప్రాంత వాసులకు ముందుగా ఇక్కడ రైతులకు నీళ్లు ఇచ్చాక మిగులు జలాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తే రైతులకు న్యాయం చేసినట్లు ఉంటది ,కానీ ఖమ్మం జిల్లాలోని ఎడమ కాలువ కూ సాగర్ నుంచి నీళ్లు వస్తున్నాయి, మరలా నీళ్ళు వస్తున్న కాలువకే నీళ్లు ఇస్తున్నారు,
ఈ ప్రాంతంలో ఎటువంటి నీటి వసతులు లేని జిల్లాకు గోదావరి జలాలు ఈ ప్రాంతంలో ప్రవహిస్తూ ఈ ప్రాంతానికి వరం లాంటి నీళ్లను ఈ ప్రాంత రైతులను పస్తులు ఉంచుతూ సాగర్ ఎడమ కాలువ రైతులకు రెండు పంటలు పడుతుంటే మూడో పంటకు కూడా నీళ్లు ఇవ్వటం ఉమ్మడి జిల్లా మంత్రులకు ఒకే ప్రాంతం మీద ప్రేమ ఉంటే అది పక్షపాతం అవుతుంది, జూలూరుపాడు లో సీతారాం ప్రాజెక్టు డిజైన్ మార్చి జూలూరుపాడు నుంచి ఏనుకూరు సాగర్ కాలువ వరకు కాలువ పూర్తి చేశారు,
ఈ ప్రాంత రైతులకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా సీతారామ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి ఆగస్టు 15న ప్రారంభించడం ఆస్వాస్వదంగా ఉంది
కావున ఇప్పుడైనా సరే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రైతులకు గోదావరి నీళ్లు ఇచ్చి ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ డిమాండ్ చేసినారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్ బిజెపి మండల కార్యదర్శి భూక్య రమేష్ వందనపు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.