రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి చిక్కిన అడిషనల్ కలెక్టర్, సీనియర్ అసిస్టెంట్
ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మంగళవారం దొరికిపోయారు.
ధరణిలో ఓ పని చేసేందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు.
జక్కిడి ముత్యంరెడ్డి అనే వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల ల్యాండ్ ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ ను కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి ఎనిమిది లక్షలు డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్లాన్ ప్రకారం రూ.8లక్షలు కారులో పెట్టగా.. ఆ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు.
మధుమోహన్ రెడ్డిని విచారించగా.. భూపాల్ రెడ్డి చెబితేనే ఆ డబ్బులు తీసుకున్నా అని అధికారులకు చెప్పారు. ఏసీబీ అధికారుల ముందే భూపాల్ రెడ్డికి ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మాట్లాడాడు.
పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఫోన్లో చెప్పాడు. పెద్ద అంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డికి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఇద్దరిని అరెస్ట్ చేసి తర్వాత.. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోను ఏసీబీ సోదాలు నిర్వహించింది.
భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. భూపాల్ రెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరిపారు.