నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఫరూక్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్ ఇచ్చిన అర్ధగంటలో వినతి పత్రం మాయం చేసిన సిబ్బంది నిలదీసిన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు నిర్లక్ష్య సమాధానం చెప్పినా కార్యాలయ సిబ్బంది షాద్ నగర్ పట్టణంలో బుధవారం రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నీరసంగా భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ ఐక వేదిక ఆధ్వర్యంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వారి ర్యాలీ నిర్వహించే షాద్నగర్ ఎమ్మార్వో గారికి …

నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఫరూక్ నగర్ ఎమ్మార్వో ఆఫీస్

ఇచ్చిన అర్ధగంటలో వినతి పత్రం మాయం చేసిన సిబ్బంది

నిలదీసిన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని కార్యకర్తలు

నిర్లక్ష్య సమాధానం చెప్పినా కార్యాలయ సిబ్బంది

షాద్ నగర్ పట్టణంలో బుధవారం రోజు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నీరసంగా భారీ ర్యాలీ నిర్వహించిన హిందూ ఐక వేదిక ఆధ్వర్యంలో కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వారి ర్యాలీ నిర్వహించే షాద్నగర్ ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

అనంతరం వారు కార్యాలయంలోకి వెళ్లి ఒకటి రిసీవ్ కాపీ అడగగా వారికి చేదు అనుభవం ఎదురయింది. అప్పుడే తీసుకున్న వినతి పత్రం కార్యదర్శి సిబ్బంది ఎక్కడో పడేసినారు. దాని రిసీవ్ కాపీ కావాలని కార్యకర్తలు అడగగా సిబ్బంది వెతకడం ప్రారంభించారు. ఒక్క వినతి పత్రము ఇచ్చిన అర్థగంటలో మయం ఏమిటని సిబ్బంది నిరదీశారు.

ప్రభుత్వానికి బాధ్యతయుతంగా ప్రజల సమస్యలు తెలియజేయవలసిన సిబ్బంది ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఎలా అని హిందూ వాదులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం షాద్ నగర్ రెవెన్యూ సిబ్బంది అంటూ అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు.

ఇటీవల డిప్యూటీ తహసీల్దార్ ఉంటే మేము పని చేయమని చెప్పి బయట ఆందోళన దిగిన సిబ్బంది ఇప్పుడు ఎంత మంచిగా పని చేస్తున్నారా అబ్బో అని మాట్లాడుకోవడం కనిపించింది. ప్రజల సమస్యలపై పట్టింపులేని కార్యాలయ సిబ్బందికి కాసులపై మక్కువ ఎక్కువ అంటూ ప్రజలు చర్చించుకోవడం జరిగింది.

Updated On 14 Aug 2024 6:08 PM IST
cknews1122

cknews1122

Next Story