ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికిన కొప్పుల చంద్రశేఖర్ ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వచ్చిన రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద పుష్పగుచ్చమిచ్చి, శాలువా కప్పారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, …

ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం పలికిన కొప్పుల చంద్రశేఖర్

ములకలపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసగూడెంలోని సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించడానికి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ జిల్లా నాయకులు కొప్పుల చంద్రశేఖర్ ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో వచ్చిన రేవంత్ రెడ్డికి హెలిపాడ్ వద్ద పుష్పగుచ్చమిచ్చి, శాలువా కప్పారు.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు తో కలిసి ప్రాజెక్టు వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్.. ఆనందం వ్యక్తం చేసి..కొప్పుల చంద్రశేఖర్ ను అభినందించారు.

Updated On 15 Aug 2024 8:34 PM IST
cknews1122

cknews1122

Next Story