తపాలా కార్యాలయానికి తాళాలు
మమ్మల్ని ఎవరు ఏం చేస్తారని అహంకారమా
స్వతంత్ర వేడుకలు చేస్తే వచ్చేది ఏముందిలే అనే ఆలోచన
సీకే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాథిరాం నాయక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
జూలూరుపాడు
78వ స్వతంత్ర దినోత్సవం రోజు జూలూరుపాడు మండల తపాల కార్యాలయానికి రాని స్వతంత్రం ఎగరని జాతీయ జెండా కనిపించని సంబంధిత అధికారులు
ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకువచ్చి స్వేచ్ఛ సమానత్వం కల్పించిన రోజు ఆగస్టు 15 తారీకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ జెండా ఎగరవేసి ఎంతో ఘనంగా జరుపుకుంటారు కానీ జూలూరుపాడు మండల తపాలా కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి వేడుకలు జరపకపోవడం జాతీయ జెండాకే అవమానకరమని ప్రజలు అంటున్నారు అదేవిధంగా ఉప తపాలా కార్యాలయాల్లో పని చేసేటటువంటి వారు కూడా మండల కేంద్రంలో ఉన్న తపాలా కార్యాలయానికి వచ్చి స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవాసింది పోయి మండల కేంద్రంలో ఉన్న ఉద్యోగులే నిర్లక్ష్యం చేస్తే వారు ఎలా వచ్చి స్వతంత్ర వేడుకల్లో పాల్గొంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనాప్పటికీ మరల జాతీయ జెండాకి అవమానం జరగకూడదు అని కొందరు ప్రజలు అంటున్నారు