కార్మికుల సమ్మె ఎఫెక్ట్….!*
ప్రభుత్వ ఆసుపత్రిలో పడకేసిన పారిశుద్ధ్యం.
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యానికి వస్తే కొత్త రోగాలు….?
కార్మికుల సమస్యలను పరిష్కరించి ప్రజారోగ్యాన్ని కాపాడాలి
సిఐటియు కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),
ఆగస్టు 15,
ఇప్పటికే పూర్తిస్థాయిలో వైద్యులు వైద్య సిబ్బంది లేక ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వ వైద్యంపై కార్మికుల సమ్మె మరింత ప్రభావాన్ని చూపిస్తుంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాల్సిన నాలుగు నెలల వేతనాలు చెల్లించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ తీరును వ్యతిరేకిస్తూ గత మూడు రోజులు నుండి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే.
రెండు రోజులకే పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఆసుపత్రి మెడికల్ వ్యర్ధాలతో కంపు కొడుతుంది. ఇప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యం కోసం వస్తున్న రోగులకు ఆసుపత్రి వ్యర్ధాలతో కొత్త రోగాలు అంటుకుంటాయని ఆందోళన చెందుతున్నారు.
ఆస్పత్రి ఆవరణ మొత్తం వ్యర్ధాలతో దుర్వాసనలు వెదజల్లడంతో పాటు దోమలు సైర వ్యవహారం చేస్తున్నడంతో రోగులతో వచ్చిన సహాయకులు సైతం అనారోగ్య బారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు.
ఆస్పత్రిలో పనిచేస్తే పారిశుద్ధ్య పేషంట్ కేర్ సెక్యూరిటీ తదితర డిపార్ట్మెంట్లలో కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేసే సుమారు 100 మంది పైచిలుకు కార్మికులు ఒకేసారి సమ్మె బాట పట్టడంతో తలెత్తిన పారిశుధ్య సమస్యను వెంటనే పరిష్కరించక పోతే ఉన్న రోగానికి వైద్యమేమో గాని కొత్త రోగాలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి కొత్త కాంట్రాక్టర్ వచ్చిన నాటి నుండి వేతనాలు చెల్లించే దాంట్లో గతంలో కూడా అనేకసార్లు ఇదే వైఖరిని అవలంబిస్తే కార్మికుల సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. కార్మికులు వేతనల కోసం సమ్మె కి దిగిన ప్రతి సందర్భంలో అరకొర వేతనాలు చెల్లించి తాత్కాలికంగా కార్మికులను శాంతింప చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారాన్ని చూపటం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే నాలుగు నెలల నుండి వేతనాలు చెల్లించడం లేదని మెరుపు సమ్మెలోకి దిగిన కార్మికులు ఈ దఫా కాంట్రాక్టర్ నుండి శాశ్వత పరిష్కారం చూపిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
….కార్మికుల సమస్యలు పరిష్కరించి ప్రజారోగ్యం కాపాడాలి….
ఎం. బి నర్సారెడ్డి సిఐటియు కన్వీనర్
ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల పట్ల కాంట్రాక్టర్ అవలంబిస్తున్న నిరంకుశ వైఖరి ఫలితంగానే ప్రభుత్వాసుపత్రికి ఈ పరిస్థితి ఏర్పడింది. నాలుగు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ కార్మికుల సమ్మెకు కారణం అయ్యారు.
ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఇటువంటి పరిస్థితి రావడానికి కార్మికులైన కాంట్రాక్టర్ పై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి. లేనిపక్షంలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో తలెత్తే సమస్యలకు అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కార్మికుల వేతనాల బకాయిల విషయం స్థానిక శాసనసభ్యులకు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి తో పాటు డిసిహెచ్ దృష్టికి కూడా తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతోనే ప్రత్యన్యం లేక కార్మికులు సమ్మె బాట పట్టారు.
ఆసుపత్రిలో తలెత్తిన పారిశుద్ధ్య సమస్యలను ఆసుపత్రి సుబ్రమణ్యం వెంటనే ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతిని దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింప చేయాలి లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో పోరాటని మరింతగా ఉధృతం చేస్తాం.