రైతు సంఘ నాయకులకు ముందస్తుగా అరెస్ట్ చేసిన
జూలూరుపాడు పోలీసులు
సీకే న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాధావత్ హాథిరాం నాయక్
గోదావరి జలాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మరియు జూలూరుపాడు మండలానికి కేటాయించాలని ఎటువంటి పిల్ల కాలువలు తీయకుండా సీతారామ ప్రాజెక్టు ప్రారంభాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం దుర్మార్గమని కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని జూలూరుపాడు మండలాన్ని ఎడారిగా మార్చి ఖమ్మం జిల్లా మంత్రులు తమప్రాంతాలకు గోదావరి జలాలను తరలించాలని దురుద్దేశంతో యుద్ధ ప్రాతిపదికన రైతులకు కనీసం భూసేకరణ డబ్బులు ఇవ్వకుండా కాలువలు తీసి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను తరలించడం దుర్మార్గమని ఈ ప్రాంత రైతుల సమస్యలను గోదావరి జలాల దోపిడీని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి వెళుతున్న రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ గోదావరి జలాలు జూలూరుపాడు మండలానికి కేటాయించాలని రైతు సంఘం నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలని ఏన్కూర్ కాలువకు వెళ్లే సీతారామ కాలువ దగ్గర నిరసన తెలియజేసి జూలూరుపాడు మండల హెడ్ క్వార్టర్ లో రాస్తారోకోతో నిరసన తెలియజేస్తున్న సిపిఎం నాయకత్వాన్ని అరెస్టు చేసి జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది