ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం
- “సీతారామ”పై బీఆర్ఎస్ వి అన్ని పచ్చి అబద్ధాలు
- ముగ్గురు మంత్రుల నేతృత్వంలో విస్తృత అభివృద్ధి
- ఖమ్మం ఎంపీ రామసహాయo రఘురాం రెడ్డి
- కూసుమంచిలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ
సికే న్యూస్ ప్రతినిధి
కూసుమంచి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నింటినీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ఆరు గ్యారెంటీలను ఆచరణలో పెట్టామని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీని ముఖ్యమంత్రి వైరాలో ప్రారంభిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీని అసలు పట్టించుకోనే లేదని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలోనే ఎంతో చేసిందని, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసింది శూన్యమని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్ 80 శాతం వారే పూర్తి చేసినట్లుగా చెబుతున్నారని, అవన్నీ పచ్చి అబద్దాలని ఎంపీ రఘురాo రెడ్డి విమర్శించారు.
రూ.19వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వ పాలనలో చేపడితే వారు ఖర్చుపెట్టింది కేవలం రూ.7వేల కోట్లేనని, ఆ తర్వాత నిధులను కేటాయించి పనులు పూర్తిచేయిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. బీఆర్ ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటుందో, కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని విమర్శించారు.
కాంగ్రెస్ పై నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారని, బీఆర్ఎస్ వారు కాస్త ఓపిక పట్టి తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడాలని సూచించారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రివర్యులు ఉభయ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ రఘురాo రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో..: మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, శ్రీనివాస్ నాయక్, కొప్పుల అశోక్, నాయకులు శ్రీనివాసరెడ్డి, హఫీజుద్దీన్, కొడాలి గోవిందరావు, జొన్నలగడ్డ రవి, కొప్పుల చంద్రశేఖర్, బజ్జూరి వెంకటరెడ్డి, వెన్నపూసల సీతారాములు, భీష్మా చారి, రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, బారి వీరభద్రం, పెండ్ర అంజయ్య, వినోద, తదితరులు పాల్గొన్నారు.