కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో బుధవారం చోటు చేసుకుంది. వెలుగోడు ఎస్‌ఐ భూపాలుడు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్లాపురానికి చెందిన ఉదారు మహేష్‌రెడ్డి (40), భార్య ప్రశాంతి (39) దంపతులు పొలంలో వరి, మిరప, మొక్కజొన్న సాగు చేసేవారు. వారి కుమారుడు నిఖిల్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. ఎప్పుడో ఒకసారి …

కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య

కుమారుడు చేసిన అప్పులకు రైతు దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన నంద్యాల జిల్లా వెలుగోడు మండలం అబ్దుల్లాపురంలో బుధవారం చోటు చేసుకుంది.

వెలుగోడు ఎస్‌ఐ భూపాలుడు తెలిపిన వివరాల ప్రకారం… అబ్దుల్లాపురానికి చెందిన ఉదారు మహేష్‌రెడ్డి (40), భార్య ప్రశాంతి (39) దంపతులు పొలంలో వరి, మిరప, మొక్కజొన్న సాగు చేసేవారు.

వారి కుమారుడు నిఖిల్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడేవాడు. ఎప్పుడో ఒకసారి వస్తాయని తల్లిదండ్రులు కూడా నిఖిల్‌ను ప్రోత్సహించడంతో బంధువుల, తెలిసిన వారందరి వద్ద రూ. రెండు కోట్లకుపైగా అప్పులు చేశారు.

రుణదాతలకు సమాధానం చెప్పలేక ఇల్లు, భూమి అమ్మి కొంత అప్పు చెల్లించారు. ఇళ్లు లేకపోవడంతో మహేష్‌ రెడ్డి, తన భార్య ప్రశాంతితో కలిసి వెలుగోడులోని వరుసకు మామా అయినా చండ్ర వెంకటేశ్వర్‌ రెడ్డి ఇంట్లో గత కొన్నాళ్లుగా ఉంటున్నారు.

ఈ క్రమంలో మిగతా అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక మహేష్‌ రెడ్డి దంపతులు మనస్తాపం చెందారు. సోమవారం తన మామ ఇంటి నుంచి అబ్దుల్లాపురం వచ్చారు.

మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని తాగి పొలంలో ఆత్మహత్య చేసుకున్నారు. వారి మృతదేహాలను పోలీసులు ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆత్మకూరు డిఎస్‌పి రామాంజనాయక్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated On 15 Aug 2024 11:03 AM IST
cknews1122

cknews1122

Next Story