భార్య కాపురానికి రావడం లేదంటూ భర్త ఆత్మహత్యయత్నం సెల్ఫీ వీడియోలో ఆవేదన భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపానికి గురైన యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం ఆవాస గ్రామం గుర్రతండాలో గురువారం జరిగింది. గుర్రతండాకు చెందిన ధరావతు విజయ్‌ గతేడాది అదే తండాకు చెందిన బానోతు నిఖితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నిఖిత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. కొద్దిరోజుల క్రితం నిఖితను ఆమె …

భార్య కాపురానికి రావడం లేదంటూ భర్త ఆత్మహత్యయత్నం

సెల్ఫీ వీడియోలో ఆవేదన

భార్య కాపురానికి రావడం లేదంటూ మనస్తాపానికి గురైన యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు.సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం ఆవాస గ్రామం గుర్రతండాలో గురువారం జరిగింది.

గుర్రతండాకు చెందిన ధరావతు విజయ్‌ గతేడాది అదే తండాకు చెందిన బానోతు నిఖితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నిఖిత ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భవతి. కొద్దిరోజుల క్రితం నిఖితను ఆమె తల్లితండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు.

ఇటీవల తన భార్యను తీసుకురావడానికి అత్తగారింటికి వెళ్లిన విజయ్‌ను రూ.50లక్షలు తన భార్య పేరిట డిపాజిట్‌ చేయాలని లేదా ఇల్లు, భూమి భార్య పేరు మీద రాయాలని అత్తంటి వారు డిమాండ్‌ చేస్తూ అతడిని కొట్టారు. తిరిగి అతడిపైనే కేసు పెట్టారు.

దీంతో మనస్తాపానికి గురైన విజయ్‌ తన భార్య తన వద్దకు రాకుండా అడ్డుపడుతున్న మామ బానోతు బాలాజీ, అత్త గీత, వారి పెద్ద కుమార్తె నందు, తన భార్య మేనమామలు మున్నా, వినోద్‌, బుడ్డి, లచ్చుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియోను పోస్ట్‌ చేశాడు.

కుటంబ సభ్యులు గమనించి తండా శివారులో ఉన్న వ్యవసాయ భూముల్లో అతడి కోసం వెతకగా.. ఆచూకీ లభించడంతో వెంటనే సూర్యాపేటలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయమై ఎస్‌ఐ వెంకట్‌రెడ్డిని వివరణ కోరగా.. ఈ ఘటనపై తమకు సమాచారం అందిందని, యువకుడు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

Updated On 16 Aug 2024 12:21 PM IST
cknews1122

cknews1122

Next Story