మరణంలోనూ భర్తకు తోడుగా వెళ్లిన భార్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది. మణుగూరులో నివాస ముండే కొమ్ము సోమయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పొలంలోనే కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచాడు. మధ్యాహ్నం దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కొమ్ము శంకరమ్మ, అతని కోసం ఎదురు చూస్తున్న …

మరణంలోనూ భర్తకు తోడుగా వెళ్లిన భార్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈరోజు తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ద దంపతులు నిమిషాల వ్యవధిలో మృతి చెందటం ఆ కుటుంబాన్ని కలచి వేసింది.

మణుగూరులో నివాస ముండే కొమ్ము సోమయ్య తన వ్యవసాయ పొలంలో పనులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో పొలంలోనే కుప్పకూలి పోయి ప్రాణాలు విడిచాడు.

మధ్యాహ్నం దాటిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య కొమ్ము శంకరమ్మ, అతని కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఇంటికి సోమయ్య మృతదేహం చేరుకోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించింది.

భర్త సోమయ్య మృతి చెందడంతో తట్టుకోలేని శంకరమ్మ నిమిషాల వ్యవధిలోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయింది. వెంటనే బంధవులు ఆమెను హాస్పిటల్‌కు తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్ తెలిపారు.

దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం మరింత కుంగిపోయింది. వీరికి ముగ్గురు కుమారులు అంతా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. మణుగూరులో అంటూ వ్యవసాయ పనులు చూసుకునే దంపతులు ఇద్దరు ఇలా గంట వ్యవధిలోనే చనిపోవడంతో అందరిని కలచివేసింది.

ఒకరి తరువాత ఒకరు వృద్ధ దంపతులు మృతిచెందడం తో ఆ కుటుంబం తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే సోమయ్య – శంకరమ్మ దంపతుల మృతితో వారు నివాసముండే, బాలాజీ నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి,

వృద్ధ దంపతుల మృత దేహాలను చూసి బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు…

Updated On 16 Aug 2024 1:55 PM IST
cknews1122

cknews1122

Next Story