మాజీ సీఎం కు అస్వస్థత…!
కెసీఆర్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్, గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం.
కేసీఆర్ ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని ఫామ్‌హౌస్‌లోనే వున్నారు.యశోద హాస్పిటల్ బృందం ఫామ్‌హౌస్‌లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ నెలకొల్పి కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కేసీఆర్‌కి అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు నాలుగు రోజుల క్రితం ప్రత్యేక అంబులెన్స్.లో ఫాంహౌస్‌కి తీసుకువచ్చారు. తనని ఆస్పత్రిలో చేర్చితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకుంటుందని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులను కేసీఆర్ వారించినట్టు సమాచారం.
అసెంబ్లీ ఎలక్షన్లలో ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోకసభలో సున్నా స్థానాలు రావడం, ఐదు నెలలుగా కూతురు కవిత తీహార్ జైల్లో ఉండడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనలతో కేసీఆర్ తీవ్ర మనోవేదన చెందారని తెలుస్తోంది.
పార్టీని నడిపించే శక్తి లేని కేటీఆర్, తప్పించుకొని తిరిగే మనస్తత్వం ఉన్న హరీష్ రావు… దాంతో పార్టీనీ నడిపించే నాయకుడు లేక బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో వున్నాయి.
కేసీఆర్ అస్వస్థత విషయం ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదని, తెలిస్తే వాళ్ళు పార్టీ మారిపోయే ప్రమాదం వుందని ఎమ్మెల్యేలని విదేశీ పర్యటనకి తీసుకువెళ్లారని సమాచారం.
కేసీఆర్ తీవ్ర అస్వస్థత విషయం తెలిసిన కొందరు నాయకులు , హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ BRS పార్టీ నాయకులు మండిపడ్డారు. అసలు నిజం ఏంటంటే..!
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. BRS పార్టీ ఈ వాదనలను కొట్టిపారేసింది.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రామాణికమైన నివేదికల కోసం వెతకగా, మాకు అలాంటి నివేదికలేవీ దొరకలేదు.
కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్‌ఎస్ ఖండించిందని teluguglobal.com ప్రచురించిన కథనం మేము గుర్తించాం. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్ ఛానల్ ఫేక్ న్యూస్ కు ఫ్యాక్టరీగా మారిందంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం.