గుడుంబా రవాణా చేసే ముఠా అరెస్ట్
160 లీటర్ల గుడుంబా పట్టివేత
చత్తీస్గడ్ నుంచి రవాణా
సి కే న్యూస్ వాజేడు మండల ప్రతినిధి షేక్ రహీమ్
ములుగు జిల్లా వాజేడు మండలం,టేకులగూడెం శివారులలో 18 వ తారీఖు ఉదయం గుడుంబా రవాణా చేస్తున్నారని విశ్వసనీయమైన సమాచారం అందుకున్న పోలీసులు వారు గ్రామ శివారులలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు మగ వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై చత్తీస్గడ్ నుండి టేకులగూడెం గ్రామం వైపు వస్తూ పోలీస్ పార్టీని చూసి పారిపోవుటకు ప్రయత్నించగా అనుమానంతో అప్రమత్తమై వారిని పోలీస్ వారు వెంబడించి పట్టుకున్నారు.
వారి దగ్గర నుండి 10 ప్లాస్టిక్ సంచులు నుండి ప్రభుత్వ నిషేధించిన నాటు సారాయి వాసన వస్తుండగా తనిఖీ చేయగా నాటుసారా సుమారు 160 లీటర్లు ఛత్తీస్గఢ్ నుండి కొనుగోలు చేసి దానిని తెలుపు రంగు గల ప్లాస్టిక్ సంచులు పోసుకొని వస్తుండగా దానిని పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు Rs.64000/- గా పోలీసులు అంచనా వేశారు.
వారిని విచారించగా వారి పేర్లు తాడూరి రవీందర్, చిన్న గొల్లగూడెం గ్రామం,దాగం మధుసుధన్ రావు, ధర్మారంగ్రామం,తల్లాడి ప్రశాంత్,పేరూరు గ్రామం మరియు కురుసం నరేష్, పూసూరు గ్రామం అని తెలియజేయడం జరిగింది. మరియు వీరి దగ్గర నుండి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పేరూరు ఎస్సై గుర్రం.కృష్ణ ప్రసాద్, మరియు హెడ్ కానిస్టేబుల్ K.సాంబశివ రావు, పోలీస్ కానిస్టేబుల్ పి.నరేష్, టి .మరేశ్వర రావు, ఏ .ఎంకటేశ్వర్లు,జి . నవీన్ పాల్గొనడం జరిగింది.